Back to FeedQuickToday Shorts

District
Aug 13, 2026Short Read
గుడుంబాపై పోలీసుల దాడులు..
15 లీటర్లు స్వాధీనం..250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
తొర్రూరు, ఆగస్టు13(క్విక్ టుడే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎస్సై మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని భీముని తండాలో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు .గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై మహేందర్రెడ్డి తెలిపారు.గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అక్రమ మద్యం తయారీ, విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.





