
జై యువ నినాదంతో ముందుకుసాగాలి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై26(క్విక్ టుడే న్యూస్):
జై జవాన్, జై కిసాన్, జై యువ నినాదంతో మనం ముందుకుసాగాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేశ భవిష్యత్ కు యువ శక్తిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఆదివారం జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందు కోసంయువ భారతమే ప్రపంచం దిశను నిర్దేశిస్తుందని చెప్పారు. యువతకు 21 ఏళ్లకే శాసనసభ, లోకసభ, 25 ఏళ్లకే శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. 21 ఏళ్లకే సివిల్ సర్వీసులకు ఎన్నికవుతున్న యువత చట్టసభల్లో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు నాయకత్వం వహించడంతో పాటు వ్యాపార, సాంకేతిక రంగాల్లోనూ యువత సత్తా చాటుతోందని గుర్తు చేశారు. అందుకే మన కొత్త నినాదం.. జై జవాన్, జై కిసాన్, జై యువ కావాలని నినదించారు.





