Back to FeedQuickToday Shorts

National
Aug 17, 2026Short Read
బాలీవుడ్ స్టార్లకు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్
బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నోటీసులు జారీ చేసింది.
వీరు ముగ్గురూ కలిసి నటించిన 'విమల్ ఇలాచీ' ప్రకటనపై వివాదం తలెత్తడమే దీనికి కారణం.మహారాష్ట్రలో నిషేధించబడిన విమల్ పాన్ మసాలా ఉత్పత్తులకు పరోక్షంగా ప్రచారం కల్పించేలా ఈ ఇలాచీ యాడ్ ఉందని FDA పేర్కొంది.
ఈ ప్రకటనలో వారి పాత్రపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.
వినియోగదారులను తప్పుదారి పట్టించే ఇటువంటి ప్రకటనలలో నటించినందుకు చట్ట ప్రకారం గరిష్టంగా రూ.
10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.
స్టార్ హీరోలు ఇలాంటి ప్రకటనలలో నటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.





