Back to FeedQuickToday Shorts

National
Aug 11, 2026Short Read
'హర్ ఘర్ తిరంగా' లో పాల్గొనండి: ప్రధాని మోడీ పిలుపు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక వీడియోను పంచుకున్నారు.ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి, స్వాతంత్ర్య దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుందామని మోడీ పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించడంతో పాటు, 'వికసిత్ భారత్' నిర్మాణానికి పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేద్దామని ఆయన ఆకాంక్షించారు.
ప్రతి ఇల్లు, ప్రతి గుండెలో త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని ప్రధాని ఆకాంక్ష వ్యక్తం చేశారు.





