Back to FeedQuickToday Shorts

National
Sep 5, 2026Short Read
యువతను దారిలో పెట్టాల్సిన బాధ్యత టీచర్లదే: ప్రధాని మోదీ
జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 82 మంది టీచర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ముఖ్యంగా నేటి యువతలో డ్రగ్స్ మహమ్మారి పట్ల టీచర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలని కోరారు.
చదువుతో పాటుగా క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలవుతూ అధిక సమయం స్క్రీన్‌కే కేటాయించడం పట్ల ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ విద్యార్థుల్లో మొబైల్ వినియోగాన్ని తగ్గించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.





