ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి
త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడాలి
ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
రాయదుర్గం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ వేలాది మంది విద్యార్థులతో ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ధర్నా
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి హనుమంతరాయడు, కుల్లాయిస్వామి
2024 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తొలగించారు, ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం లేక విద్యార్థినీ విద్యార్థులు అన్న క్యాంటీన్ల వైపు పరుగులు తీస్తూ ఐదు రూపాయల భోజనం తింటున్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు.
దానివల్ల జూనియర్ కళాశాలలో చాలా మంది విద్యార్థులు డ్రాపోర్ట్స్ సంఖ్య పెరిగింది చాలామంది విద్యార్థులు విద్యను మానేసి పనులకు వెళ్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. విద్యార్థుల ఇబ్బందులను కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసి విద్యార్థుల ఆకలి కేకలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మాట్లాడి విద్యార్థుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని కోరారు.