AP Elections 2024 : ఎన్నికల ప్రచారానికి పుల్ స్టాప్.. రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
ఈనేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ఈరోజుతో పుల్ స్టాప్ పడింది. దీంతో ఇవాళ్టి సాయంత్రం వరకు మోత మోగించిన మైకులు మూగబోయాయి. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.
AP Elections 2024 : తెలంగాణలోనూ మే 13నే పోలింగ్
పోలింగ్ అధికారులు కూడా మే 13న పోలింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు మూడు దశల్లో దేశ వ్యాప్తంగా 285 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మే 13న 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి. 96 ఎంపీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
ఇక.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ జరిగిన వెంటనే విడుదల కావడం లేదు. ఎందుకంటే.. నాలుగో దశ పోలింగ్ తర్వాత కూడా ఇంకా ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ ఉన్నందున.. జూన్ 1న సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని నిషేధం విధించింది.
మరోవైపు ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్స్ అన్నీ బంద్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి అంటే మే 11న సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాప్స్ బంద్ అవనున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
ఏపీలో చూసుకుంటే ప్రధాన పార్టీలు వైసీపీ, కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య టఫ్ ఫైర్ నడుస్తోంది. వైసీపీ నుంచి ఏకంగా సీఎం జగన్ రంగంలోకి దిగి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. ఎన్నికల ప్రచారంలో తానే దగ్గరుండి పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు.
మరోవైపు కూటమికి మద్దతుగా ఏకంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.