కేసీఆర్.. నిన్ను, నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతాం..

కేసీఆర్.. నిన్ను, నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతాం..

మా పార్టీ వీర సైనికులు నీ పార్టీని పునాదులు లేకుండా చేస్తారు 
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 


నల్లగొండ జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 17. (క్విక్ టుడే ) : కెసిఆర్.. నిన్ను నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వెల్లడించారు. బుధవారం న‌ల్ల‌గొండ‌లోని  క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కెసిఆర్ మా పార్టీని టచ్ చేసి చూడు.. మా పార్టీ కార్యకర్తలే నీ పార్టీ పునాదులు లేకుండా చేస్తారని హెచ్చరించారు.

నీ కొడుకు గత కొద్ది రోజులుగా ఇలాంటి  ప్రగల్బాలు పలుకుతుంటే, రాజకీయాల్లో బచ్చగాడు ఏమి తెలియని వదిలేసాను అన్నారు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాన్ని మాట్లాడడం పిచ్చితనానికి, మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. పాస్‌పోర్ట్ దొంగవు నీవు అని హేళన చేశారు.

1700 -1

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెడ్పిటిసి గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ముఖ్యమంత్రిగా  పదవిలో కొనసాగుతున్నారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీ ముఖం చూపించలేక రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోయావ‌ని మంద‌లించారు. నీవు, నీ కొడుకు, నీ అల్లుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

బిడ్డ జైల్లో ఉంటే కనీసం బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేయలేని కేసీఆర్‌ను చూస్తే జాలేస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే 30 మంది ఎమ్మెల్యేలను ఏనాడో చేర్చుకునే వాళ్ళం అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని మెదక్ సీటు వస్తుందని, ఆశపడుతున్నారని, ఆశాభంగం ఎదురుగాక తప్పదన్నారు.

తెలంగాణలో 13 ఎంపీ సీట్లు గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూముల మోహన్ రెడ్డి. నల్లగొండ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య. నల్లగొండ మార్కెట్ చైర్మన్ జుకూరి రమేష్. తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?