Gutta Sukhender Reddy : కేసీఆర్‌పై నమ్మకం లేకనే పార్టీని వీడుతున్నారు.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బిఆర్ఎస్ లో ఎమ్మెల్యే తో రాజకీయాలు సాగుతున్నాయని ఇది మంచి పద్ధతి కాదన్నారు. పార్టీలో గ్రామ, మండల, జిల్లా శాఖలు లేవని సంస్థ గత నిర్మాణం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలు నడపవలసిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సమీక్షలు జరగవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వారితోనే పార్టీ ప్రజలకు దూరమైందని అన్నారు. ఈ విషయం కార్యకర్తలు అందరికీ తెలుసు అన్నారు. తనను విమర్శించే బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. త్వరలో వారి బండారం బయటపెడతానన్నారు. గతంలో తాను కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి హామీ తోనే బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. కానీ కెసిఆర్ ఆ మాట నిలబెట్టుకో లేదన్నారు.
ప్రస్తుతం తాను ఏ పార్టీతో సంబంధం లేని రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్నానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీల అనర్హతకు సంబంధించి ఫిర్యాదులను రాజ్యాంగం ప్రకారం న్యాయ నిపుణుల సలహాలతో నిష్పక్షపాతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై ప్రజలలో భారీ అంచనాలు ఉన్నాయని ఎన్నికల్లో అనేక హామీలు ఇవ్వడం ఖజానా ఖాళీగా ఉండటం కనీసం ఏడాదిపాటైన ప్రభుత్వానికి సమయం ఇవ్వవలసి ఉంటుందన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయకపోతే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు అన్నారు.