Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు ఏమైంది?.. ఎందుకు ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొనలేకపోతున్నారు?
కానీ.. కాలం గిర్రున తిరుగుతుంది కదా. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను దీటుగా ఎదుర్కోగలిగే సత్తాను కలిగి ఉన్నది పవన్ మాత్రమే. పవన్ కళ్యాణ్ వల్లనే ప్రస్తుతం ఏపీలో జగన్ కు సరైన ప్రత్యర్థి ఎదురుపడ్డాడు. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
దానికి కారణం.. పవన్ కళ్యాణ్ తరుచూ అనారోగ్యం పాలు కావడం. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు కావచ్చు.. ఎన్నికల ఒత్తిడి కావచ్చు.. రెస్ట్ లేకుండా తిరగడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ చాలా అనారోగ్య ఇబ్బందులకు గురవుతున్నారు.
Pawan Kalyan : ఇన్‌ఫ్లూఎంజా ఇన్‌ఫెక్షన్ వల్లనే ఇంత ఇబ్బందా?
పవన్ కళ్యాణ్ కు వింత వ్యాధి ఇబ్బంది పెడుతోందనే చెప్పుకోవాలి. ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ ఆయన్ను వేధిస్తోంది. అందుకే.. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సరిగ్గా పాల్గొనలేకపోతున్నారు. నిజానికి.. ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ తర్వాత సోకింది. ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. ఆ ఇన్‌ఫెక్షన్ మాత్రం ఆయన్ను వీడటం లేదు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయనకు పూలదండలు వేయడం లాంటి చేస్తున్నారు. పువ్వులు, ఇతర దండల వల్ల ఆ ఇన్‌ఫెక్షన్ కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఆరోగ్యానికి ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది. పువ్వులు, వాటి రేకులు పవన్ ముఖం మీద పడటం, దాని వల్ల ఆయనకు తుమ్ములు వస్తే ఇబ్బంది ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.
అందుకే గజమాలలు, ఇతర పూల దండలు, సెల్ఫీలు వద్దు అని జనసేన పార్టీ ముందే తెలిపింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా ఇన్‌ఫెక్షన్ వల్ల పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తుల్లో నిమ్ము వచ్చింది.
దాని వల్లనే పవన్ కళ్యాణ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే విజయ వారాహి యాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. రెండు రోజుల ప్రచారం తర్వాత జ్వరం రావడంతో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్లీ ఏపీకి వచ్చి చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
అయినా కూడా ఆయనకు ఆ సమస్య పూర్తిగా తగ్గకపోవడంతో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనలేకపోతున్నారు. 74 ఏళ్ల చంద్రబాబు ఎంతో హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా.. చంద్రబాబు అంత హుషారుగా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోవడంతో జనసేన సైనికులు ఒకింత బాధపడుతున్నారు.
ఏపీలో పేరుకు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నా.. టీడీపీ, జనసేన నేతలు తప్పితే పెద్దగా బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు లేవు. దీంతో కూటమిని గెలిపించే బాధ్యత చంద్రబాబు, పవన్ మీదనే పడింది. ఏది ఏమైనా.. ఈసారి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నూటికి నూరు శాతం తన శక్తిని ఒడ్డుతున్నారు పవన్ కళ్యాణ్.
కానీ.. తన అనారోగ్య సమస్యల వల్ల ఆయన కొంచెం వెనుకబడుతున్నారు. చూద్దాం.. ఇంకో 20 రోజుల పాటు తన అనారోగ్య సమస్యలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే.