KTR Warning To Youtube Channels : ఆ యూట్యూబ్ చానెల్స్‌కి కేటీఆర్ వార్నింగ్.. వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

KTR Warning To Youtube Channels : ఆ యూట్యూబ్ చానెల్స్‌కి కేటీఆర్ వార్నింగ్.. వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

KTR Warning To Youtube Channels : ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా సోషల్ మీడియానే ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇది వరకు టీవీల్లో, పేపర్లలో వచ్చే వార్తలనే ప్రజలు నమ్మేవారు. కానీ.. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఎప్పుడు ఏం జరిగినా క్షణాల్లో ఆ సమాచారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. సోషల్ మీడియాలో అన్నీ నిజమైనవే ఉండవు. కొన్ని ఫేక్ కూడా ఉంటాయి.

కావాలని కొందరి మీద పని కట్టుకొని తప్పుడు రాతలు రాసేవాళ్లు ఉంటారు. అవి చూసి కొందరు నిజమే అనుకుంటారు. మరి.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేదెవరు. సోషల్ మీడియాలో తమకు నచ్చినట్టు రాసుకుంటే.. వేరే వాళ్లకు ఇబ్బంది కలిగిస్తే ఎలా? దీనికి ఒక అంతు, అదుపు ఉండదా? అంటే.. ఎస్ ఉండదు అనే చెప్పుకోవాలి. దేన్ని నమ్మాలి.. దేన్ని నమ్మకూడదు అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

కానీ.. ఎవరి మీద అయినా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం వాళ్లు ఇది తప్పుడు ప్రచారం అని చెప్పొచ్చు. లేదంటే ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు.  తెలంగాణ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.

పార్టీని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చివరకు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు పార్టీ పరువును బజారుకీడుస్తూ.. తమకు నచ్చినట్టుగా కొన్ని యూట్యూబ్ చానెళ్లు తమకు భంగం కలిగిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తమను వ్యక్తిగతంగా, తమ పార్టీని దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 

25 -1

KTR Warning To Youtube Channels : ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు 

ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొన్ని యూట్యూబ్ చానెళ్లు కావాలని తమను టార్గెట్ చేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాయని ఆయన మండిపడ్డారు. అలాంటి వాళ్లను వదిలిపెట్టమని ఖచ్చితంగా వాళ్లపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ చానెళ్లు కొన్ని, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వల్ల కావచ్చు.. లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నారు.

ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోందని అర్థం అవుతోంది. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాం.. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  గతంలో కూడా తమపై అసత్య ప్రచారాలను చేశారని, అవాస్తవాలను ప్రసారం చేశారని.. అటువంటి మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు.

25

ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానెల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబ్ నెయిల్స్ తో వార్తల పేరిట ప్రాపగాండాకు పాల్పడుతున్న యూట్యూబ్ చానెళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.

దీంతో పాటు ఆయా యూట్యూబ్ చానెళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు చేస్తామన్నారు.  ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని, అలా కాకుండా కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానెళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?