Gundala : ఎండిపోయిన పంట పొలాలకు  నష్టపరిహారం చెల్లించాలి

సిపిఐ జిల్లా నాయకులు కుసుమని హరిచంద్ర

Gundala : ఎండిపోయిన పంట పొలాలకు  నష్టపరిహారం చెల్లించాలి

Gundala :  గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండలం తురకల శాపురం గ్రామంలో  కాపర్తి ఎల్లయ్య సురిగళ్ళ బిక్షం కొమురయ్య సురేష్ సతీష్ ఎండిపోయిన  పంట పొలాలను సిపిఐ జిల్లా నాయకులు కుసుమని హరిచంద్ర, సిపి ఐ మండల కార్యదర్శి అనంతుల రామ చంద్రయ్యలు సందర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ  రైతు ఆరు కాలాలు ఇష్టపడి పెట్టుబడి పెట్టి దిక్కు  దోచని స్థితిలో  కనుల ముందే పంట ఎండిపోవడం రైతుకు కన్నీళ్లే మిగిలిస్తున్నాయ‌న్నారు. ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి పెట్టి నోటి కాడికి వచ్చిన పంట ఎండిపోతుంద‌న్నారు.   15 రోజులు  దేవాదుల కాలువ నీళ్లు అందించినట్లయితే భూగర్భ జలాలు అడుగంటి పోకుండా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అన్ని వసతులు ఉన్న కొట్లాది రూపాయలు పెట్టి వెచ్చించిన దేవాదుల కాలువ ద్వారా మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించి కుంటలు చెరువులు నింపాలని కోరారు.

1013

సంబంధిత అధికారులు రైతులకు అందుబాటులో ఉండి దేవాదులకు రైతులకు సాగునీరు విడుదల చేయాలని వేడుకున్నారు.  ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా వదిలివేసిన కాలువలను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ మండలాన్ని పరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు.  రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సీజన్లో పంట నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకొని పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే హరిచంద్ర, సిపిఐ మండల నాయకులు యు కొమురయ్య, కే యోసేపు, పుల్లయ్య, భిక్షం, ఇతరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?