Pirjadiguda Mayor : పీర్జాదిగూడ మేయర్ పీఠంపై కాంగ్రెస్ కన్ను
On
ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన 12మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు
మరికొందరిని చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం
జూన్ 5న మేయర్ పదవిపై అవిశ్వాస తీర్మానం
అప్పటి వరకు తలదాచుకునేందుకు 11 మంది కార్పొరేటర్ల యత్నం
ఓఆర్ఆర్‌పై మేయర్ వాహనాలను వెంబడించిన కాంగ్రెస్ నేతలు
మీడియాకు సమాచారం అందడంతో పరారైన నాయకులు
Pirjadiguda Mayor : పీర్జాదిగూడ, క్విక్ టుడే న్యూస్ : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేయర్ జక్కా వెంకట్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు పార్టీలోని కొందరు కార్పొరేటర్లు ఓ వర్గంగా ఏర్పడి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
అయితే ఇటీవల 12 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మేయర్ పదవిని కైవసం చేసుకోవాలంటే నాలుగింట మూడోవంతు కార్పొరేటర్లు (18 మందికి పైగా) మద్దతు అవసరం ఉంది. అప్పుడే అవిశ్వాస పరీక్ష నెగ్గుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు సరిపడా సంఖ్యా బలం లేకపోవడంతో మరికొందరిని పార్టీలోకి లాగేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా తన పదవిని కాపాడుకునేందుకు మేయర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల కంటే ముందుగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జూన్ 5వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్ గౌతమ్ అనుమతి ఇచ్చారు.
అయితే అప్పటివరకు ఎక్కడైనా తలదాచుకోవాలనే ప్రయత్నంలో 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి వెళ్తుండగా వారి వాహనాలను కాంగ్రెస్ నాయకులు వెంబడించారు. ఆదివారం రాత్రి ఓఆర్ఆర్‌పై వెంబడించి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి సహా మిగతా కార్పొరేటర్లు చాకచక్యంగా తప్పించుకున్నారు. ముందుగా మీడియా, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు సమాచారం అందజేశారు. తక్షణమే ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ ఎగ్గిట్ వద్దకు రావాలని సమాచారం చేరవేశారు. దీంతో ఆక్కడికి మీడియా, బీఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కాంగ్రెస్ నాయకులు తప్పించుకున్నారు.
అనంతరం మీడియా సమావేశంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి సహా కార్పొరేటర్లంతా మీడియాతో మాట్లాడుతూ తమపై దాడి చేసి హత్య చేసేందుకు దాదాపు 40 వాహనాల్లో తమను వెంబడించారని వాపోయారు. ఓఆర్ ఆర్ పై వేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
తమను వెంబడించిన వాహనాల నెంబర్లను నోట్ చేసుకున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్రమైన అందోళనలు చేస్తామని హెచ్పరించారు.
Tags:
Related Posts
Latest News
Travel: ఎంత ఖర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాలల్లో టూరిజానికి అవకాశం లేదు?
15 Dec 2024 08:49:47
Travel: మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...