Gutta Sukhender Reddy: ఎన్నిక‌ల్లో పోటీ నుంచి అమిత్ రెడ్డి దూరం

మీడియా తో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్

Gutta Sukhender Reddy: ఎన్నిక‌ల్లో పోటీ నుంచి అమిత్ రెడ్డి దూరం

Gutta Sukhender Reddy: నల్లగొండ జిల్లా ప్రతినిధి. మార్చి 15 (క్విక్ టుడే) : ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం  మీడియా తో చిట్ చాట్ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా మాట్లాడారు. ఎన్నికల సమయంలో రకరకాల ఊహాగానాలు రావడం సాధారణం అన్నారు.

వివిధ కారణాల రీత్యా మా తనయుడు అమిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నుండి వెనక్కి తగ్గారు అని అన్నారు. స్థానిక పరిస్థితులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల తీరు తో నిర్ణయం మార్చుకున్నామన్నారు. ఎమ్మెల్యే కేంద్రం గా పార్టీని నడపడం.. నిర్మాణం లోపాల వల్లే నేతలు పార్టీ వీడుతున్నారనే చర్చ నడుస్తోంది అన్నారు. కాంగ్రెస్ లో అమిత్ రెడ్డి  చేరిక కు గతం లో ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవం అన్నారు.

కానీ ఆ తరువాత ఎటువంటి చర్చ లేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మా సమీప బంధువు అన్నారు. వేం నరేందర్ రెడ్డితో మా తనయుడు అమిత్ భేటి పెద్దగా ప్రాధాన్యం లేనిది అన్నారు. ఆ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదు అన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన విషయం లో  ప్రజల్లో సానుకూలత ఉంది అన్నారు. ప్రజల అభిప్రాయమే నా అభిప్రాయం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?