Lok Sabha Second Phase Polls : లోక్ సభ రెండో విడత పోలింగ్ ప్రారంభం.. బరిలో ఉన్న ముఖ్యనేతలు వీళ్లే..
అయితే.. రెండో విడత ఎన్నికల్లో ప్రముఖ నేతలు పోటీల్లో ఉన్నారు. అందుకే రెండో విడత ఎన్నికలపై అందరి చూపు పడింది. నిజానికి రెండో విడతలో భాగంగా 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా.. మధ్యప్రదేశ్ లోని బైతూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి మృతిచెందడంతో పోలింగ్ ను థర్డ్ ఫేజ్ కు మార్చారు.
Lok Sabha Polls : ఏ రాష్ట్రాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది?
ఉత్తర ప్రదేశ్ లో 8 స్థానాలకు, మహారాష్ట్రలో 8 స్థానాలకు, మధ్యప్రదేశ్ లో 6 స్థానాలకు, బీహార్ లో 5 స్థానాలకు, అస్సాంలో 5 స్థానాలకు, పశ్చిమ బెంగాల్ లో 3 స్థానాలకు, ఛత్తీస్ గఢ్ లో 3 స్థానాలకు, కర్ణాటకలో 14 స్థానాలకు, జమ్ముకశ్మీర్ లో ఒక స్థానం, మణిపూర్ లో ఒక స్థానం, త్రిపురలో ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇక.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ప్రతిసారి పోటీ చేస్తారు. రెండో దశలోనే వయనాడ్ ఎన్నికలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
అలాగే.. హేమామాలిని కూడా మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మథుర నుంచి ఆమె గెలుపొందిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లోనూ గెలుపు కోసం ఆమె తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్, మరో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లాంటి ప్రముఖులు రెండో దశ పోలింగ్ లో బరిలో ఉన్నారు.
రెండో దశలో భాగంగా.. దేశ వ్యాప్తంగా 15.88 కోట్ల మంది ఓటర్లు ఇవాళ ఓటేయనున్నారు. మొత్తం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1200 మంది దాకా అభ్యర్థులు రెండో దశ పోలింగ్ లో బరిలో ఉన్నారు.
రెండో దశలో బీఎస్పీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. బీఎస్పీ నుంచి 74 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. బీజేపీ నుంచి 69, కాంగ్రెస్ నుంచి 68 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో కూడా రెండో దశలో భాగంగా 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా.. అందులో ఎన్డీఏ కూటమి 65 స్థానాల్లో గెలుపొందింది. ఇండియా కూటమి 23 స్థానాల్లో గెలుపొందింది.