Big shock for KCR : కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య.. ?
అయితే గతంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆ కూతురు కడియం కావ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. ఇప్పటికే సీనియర్ నేత కేకే సహా ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..
ఈ మేరకు ఉదయం వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు కావ్య లేఖ రాయడం జరిగింది. ఈ రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి , భూ కబ్జా , ఫోన్ టాపింగ్ అలాగే లిక్కర్ స్కామ్ కేసు విషయాల్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
కావున గౌరవనీయులు కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం , బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతూ కడియం కావ్య లేఖ రాశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త రాజకీయాలలో సర్వత్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేతలు పార్టీని వీడి వెళ్తున్న వేళ బీఆర్ఎస్ అధిష్టానం మూగబోతోంది.
ఇది ఇలా ఉంటే కడియం కావ్య రెండు రోజుల క్రితమే కేసీఆర్ ను కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ స్థానం నుంచి లోక్ సభ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతలోనే ఆమె పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడంతో రాజకీయాలలో ఈ వార్త చర్చానియాంశంగా మారింది.
ఇది ఇలా ఉండగా కడియం కావ్య తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటినుండే బీఆర్ఎస్ పార్టీకి ఆయన మెయిన్ వాయిస్ గా ఉన్నారు. అలాగే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా కడియం శ్రీహరి పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించారు.
ఇలాంటి తరుణంలో కడియం కావ్య పోటీ నుండి తప్పుకోవటం వెనుక శ్రీహరి నిర్ణయం ఉండే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ నుండి కడియం కావ్యకు టికెట్ ఆఫర్ వచ్చిందని వార్తలు కూడా ప్రచారం జరిగాయి. ఇలాంటి క్రమంలో కడియం కావ్య పోటీ నుండి తప్పుకోవడంతో త్వరలోనే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
అటు కాంగ్రెస్ పార్టీ కూడా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఇంకా ఎవరిని ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకుని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. అయితే పార్టీ మార్పుపై కడియం శ్రీహరి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.