Beerla Ailaiah: గుండాలలో సీసీ రోడ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Beerla Ailaiah: గుండాలలో సీసీ రోడ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Beerla Ailaiah: గుండాల‌, క్విక్ టుడే : యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండలంలోని బండ కొత్తపల్లి, వస్తా కొండూరు, పెద్ద పడిశాల, తుర్కాలషాపూర్, అంబాల, నూనె గూడెం, సీతారాంపురం, వెల్మజాల, అనంతారం, గ్రామాల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో మారుమూల మండలమైన  గుండాల మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. 

124 F

తారతమ్యం లేకుండా సంక్షేమ అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు, మండలంలో రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుండాల మండలంలో నీటి సమస్య రావొద్దని కేవలం నీటి కోసమే సుమారు రూ.25 లక్షల నిధులు కేటాయించామన్నారు. జనగామ జిల్లా నుండి గుండాల మండలానికి మిషన్ భగీరథ నుండి నీరు రావాలని అధికారులను ఆదేశించామ‌న్నారు. 

న‌వాబ్ పేట రిజర్వాయర్ నుండి రావాల్సిన నీటి కాలువ గడ్డితో పేరుకుపోవ‌డంతో ఈఎన్‌సీ.ఎస్‌సీతో తో మాట్లాడి నీటి విడుదలకు కూడా కృషి చేశామ‌న్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారంటీలోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని అన్నారు. 200 యూనిట్ల వరకు గృహలక్ష్మి పథకం కింద‌ విద్యుత్ పై జీరో బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం Suresh Raina: మెగా వేలంలో ఈ ముగ్గురు క్రికెటర్లకు జాక్ పాట్... సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు? ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం
Suresh Raina: వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సమరానికి ఈ ఈనెల 24, 25వ తారీకులలో మెగా వేలం జరగబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక భారతదేశ...
Mufasa Telugu Trailer: ది లయన్ కింగ్ ముఫాసాగా మహేష్ బాబు... అదిరిపోయిందిగా?
Egg or Chicken: కోడి ముందా గుడ్డు ముందా.. క్లారిటీ ఇచ్చిన శాస్త్ర‌వేత్త‌లు.. ఏమ‌న్నారంటే..
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా కార్తీక మాసం ప్ర‌త్యేక‌ పూజలు... పుణ్య స్నానాలే?
US Study: అమెరికాలోనూ మన విద్యార్థులే టాప్.... ఎందులో అంటే!
BSNL Live TV: టీవీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్..? ఓటీటీ యాప్స్ కూడా ఉచితం..!
Toll Plaza Free: ఇకపై ఈ వాహనాలకు టోల్ ప్లాజా టాక్స్ కట్టే అవసరం లేదు?