Medchal : మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ‌..

Medchal : మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ‌..

Medchal :  మేడ్చల్ నియోజకవర్గంలోని ప‌లు కార్పొరేష‌న్లు, మండ‌లాల నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు కార్పొరేట‌ర్లు, ముఖ్య నాయ‌కులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు అకర్షితులై టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మేల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా స్వాగ‌తించారు.

 ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ బీఅర్ఎస్ పార్టీ మునిగిపోయె నావలాంటిదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కేసీఆర్, కేటీఅర్ జైలుకు వెళ్ల‌డం  ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంద‌రికీ సముచిత స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారు.

81 -2

అనంతరం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలు చేయడంతో ముందుంటామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు.

మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 12 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

81 -3

అంతేకాకుండా పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్  బీఅర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోడుప్ప‌ల్  మున్సిపల్ కార్పొరేష‌న్ నుండి 5 మంది కార్పొరేట‌ర్లు కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, భూక్య సుమన్, సీసా వెంకటేష్ గౌడ్ , మోదుగు శేఖర్ రెడ్డి ఉన్నారు.

వీరితోపాటు కీసర ఎంపీపీ ఇందిరా లక్ష్మీ నారాయణ, చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరి రాములు గౌడ్,  ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు, ఇద్ద‌రు కో ఆప్షన్ సభ్యులు స‌హా ప‌లువురు ముఖ్య నేత‌లు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీ మారుతున్న‌ట్లు వారంతా పేర్కొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?