Janasena pawan kalyan: పిఠాపురానికే పరిమితమైన పవన్ కళ్యాణ్.. కదిలితే ఓటమిపాలేనా..?
ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళుతున్నాయి. అయితే ఇప్పటికే ఇరు పార్టీలు టికెట్లను కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా వంగ గీతాను బరిలో దింపారు. అయితే ఆ నియోజకవర్గంలో ఆమెకు మంచి పేరు ఉందని చెప్పాలి. మరి ముఖ్యంగా కాపులు ఆమెను ముద్దుబిడ్డగా చూసుకుంటారు. ఇక ఇది వైసీపీ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశమని చెప్పాలి.
అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్మను నమ్మినట్లయితే పుటుక్కుమనడం ఖాయమని పలువురు అంటున్నారు. ఎందుకంటే పైకి కనిపించే ప్రత్యర్థి వైసిపి పార్టీ అయితే కనిపించని ప్రత్యర్థి వర్మ అని స్థానిక జనసేన నాయకులు చెబుతున్న మాట. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని పిఠాపురంలో జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు.
మరోవైపు పిఠాపురంలో వైసీపీ పార్టీ శ్రేణులు వారి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ ను ఓడించే దిశగా అందరూ ఏకతాటిపై నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడిన తర్వాత వంగ గీత గెలుపు కోసం మొత్తం బాధ్యతలను తన భుజాలపై వేసుకోవడం గమనార్హం.
దీంతో వైసీపీ పార్టీ పిఠాపురంలో పద్మం వ్యూహాన్ని రచిస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఇక్కడ పిఠాపురానికే పవన్ కళ్యాణ్ ను కట్టడి చేయాలనేది వైసీపీ పార్టీ ప్రధాన ఉద్దేశం. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి కదిలినట్లయితే ఏదో చేస్తారనే భయాన్ని కలిగించే పనిలో వైసీపీ పార్టీ ఉంది.
ఈ తరుణంలో 3 రోజులు పిఠాపురంలో పర్యటిస్తే పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తారనుకుంటే శాశ్వతంగా తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నట్లే అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో కొంతమందితో మాట్లాడితే సరిపోతుందిలే అని భావిస్తే చేయగలిగేది ఏమీ లేదు.
వైసీపీ పార్టీకి ధీటుగా అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో నాయకులను మరియు పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అప్పుడే పవన్ కళ్యాణ్ బరిలో నిలబడగలుగుతారు. మరి పవన్ కళ్యాణ్ ఈ పనిని ఏమాత్రం చేయగలుగుతారు అనేది చాలా ముఖ్యం. దానికి తగ్గట్టుగానే ఎన్నికల వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ రక్షించగలగాలి.
ఇక ఇవేమీ చేయకుండా పిఠాపురంలో 3 రోజులు ఉన్న 30 రోజులు ఉన్నా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు విశ్లేషకులు చెబుతున్న మాట. ఇది ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహలు అలాగే అందరినీ కలుపుకుని వెళ్తున్న తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ కు మరోసారి ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.