Jupalli Krishna Rao: ఎన్నికలకు ముందే మా ఫోన్లు  టాప్ చేశారు.. మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు కీల‌క వాఖ్య‌లు

Jupalli Krishna Rao: ఎన్నికలకు ముందే మా ఫోన్లు  టాప్ చేశారు.. మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు కీల‌క వాఖ్య‌లు

Jupalli Krishna Rao : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫోన్ టాపింగ్ విషయంలో పలువురు కీలక నేతలతో పాటు ప్రభుత్వా అధికారులు సైతం పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే ఈ కేసు పై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేపడుతున్న పోలీసు అధికారులు ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ హస్తం ఉందని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని తప్పుపడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో జరుగుతున్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు స్పందించడం జరిగింది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ...నా ఫోన్ తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫోన్ కుడా ఎన్నికలకు ముందే టాంపింగ్ కి గురైందని తెలియజేశారు. ఇక ఈ విషయంపై  డీజీ గారికి ఐజీ గారికి కూడా మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. నా ఫోన్ నా దగ్గరే ఉన్నప్పటికీ నేను కాల్ చేయకపోయినా సరే పొంగులేటి కి కాల్ వెళ్ళింది.

7- 2

ఈ క్రమంలోనే మరుసటి రోజు పొంగిలేటి నాకు కాల్ చేసి అన్న నిన్న కాల్ చేశారు ఏంటని అడిగాడు. కానీ ఆ కాల్ నేను చేయలేదని తెలియడంతో మా ఫోన్ కుదలు టాపింగ్ కి గురయ్యాయని గుర్తించామని జువెల్ల కృష్ణారావు తెలిపారు. ఫోన్ టాపింగ్ జరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేశారు. 

ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడే కేసీఆర్ ఎందుకు ఇంత దిగజారిన అనైతిక పనులు చేస్తున్నారు అంటూ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది ఇలాంటి పనులు చేయడానికి కాదు కదా అంటూ జువెల్లి కృష్ణారావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి...

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?