Komatireddy Venkat Reddy : కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వంసం
అట్టహాసంగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్
కాంగ్రెస్ పార్టీ 14 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా
నల్లగొండ స్థానాన్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వంద రోజుల పాలనలో చేసిన అభివృద్ధితో ఈ మెజార్టీ వస్తుందన్నారు. తెలంగాణను అన్ని రంగాలలో విధ్వంసం చేసిన చరిత్ర కెసిఆర్ ది అని విమర్శించారు. నల్లగొండలో ఫ్లోరైడ్ ను తరిమేశానని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు పైన తెలంగాణలో గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలలో ఐదు హామీలు నేటికీ అమలు చేశామన్నారు.
తెలంగాణ కెసిఆర్ 10 సంవత్సర పాలనలో విధ్వంసానికి నోచుకున్నది అన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి 12వేల కోట్లతో ఎస్ఎల్బీసీ పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నాడని, నిధులు సైతం కేటాయించాడని, ఎన్నికల కోడ్ ఉన్నందున టెండర్లు పిలవలేకపోయారన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి ఆయనలోని ఎస్ఎల్బీసీని పూర్తిచేసుకుని నల్లగొండ జిల్లాను శేషశ్యాబలం చేస్తామన్నారు.
ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరల శాఖ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో టిఆర్ఎస్ బిజెపిలకు డిపాజిట్ దక్కదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలకు 10 సంవత్సరాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎస్ ఎల్ బి సి డి బ్రాహ్మణ ఇళ్లల్లో పాటు పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందన్నారు.
వెంకట్ రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. వెంకట్ రెడ్డికి మంచి అవకాశాలు వస్తాయని కోమటిరెడ్డిని చూస్తే తనకు అసూయ కలుగుతుందన్నారు. కేంద్రం నుంచి 700 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం, 280 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం, 400 కోట్లతో నల్లగొండ మున్సిపల్ అభివృద్ధిని చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టరేట్ చేరుకొని ఎంపీగా రఘువీర్ రెడ్డి నామినేషన్ వేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కుందూరు జానా రెడ్డి , రాంరెడ్డి దామోదర్ రెడ్డి, శాసనసభ్యులు బాలు నాయక్ , బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, మద్దత్తు ప్రకటించిన సిపిఐ సిపిఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, మధు రెడ్డి సుధాకర్ రెడ్డి, నెల్లికంటే సత్యం, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, జడ్పీటీసీ లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్ లు మహిళా నాయకురాలు సర్పంచ్ లు ఎంపీటీసీ లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.