BJP Manifesto : సంకల్ప్ పత్రం పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో.. ముఖ్యాంశాలు ఇవే 

BJP Manifesto : సంకల్ప్ పత్రం పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో..  ముఖ్యాంశాలు ఇవే 

BJP Manifesto : ప్రస్తుతం దేశంలో లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొన్నది. 2014 నుంచి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని తెగ ఆరాటపడుతోంది. అందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తాజాగా బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

సంకల్ప్ పత్రం పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్ లో సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా.. మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. అయోధ్యంలో రామమందిరం కల సాకారం చేశాం. డా. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ కృషి చేశారని.. సామాజిక న్యాయమే లక్ష్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. 

144 -1

మోదీ గ్యారెంటీ, వికసిత్ భారత్ 2027 థీమ్ తో మేనిఫెస్టోను రచించారు. మేనిఫెస్టోను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ రూపొందించింది. ఈ మేనిఫెస్టోలో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా హామీలను ఇచ్చారు. 

BJP Manifesto : మోదీ గ్యాంరెంటీ అనేది 24 క్యారెంట్ల బంగారం లాంటిది

ఈసందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మోదీ గ్యారెంటీ అనేది 24 క్యారెట్ల బంగారం లాంటిదన్నారు. మొత్తం 14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో మహిళలు, యువత, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పలు స్కీమ్ లను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

మోదీ కీ గ్యారెంటీ పేరుతో యూత్ కు గ్యారెంటీ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, మ్యానుఫాక్చరింగ్, ఇన్వెస్ట్ మెంట్, హై వాల్యు సర్వీస్, స్టార్టప్స్, టూరిజం, స్పోర్ట్స్ కేటగిరీల్లో అవకాశాలు కల్పించనున్నారు.  నారామణీ పేరుతో తీసుకొచ్చిన ఈ హామీలో భాగంగా దేశంలోని ఒక కోటి మంది మహిళలను ఇప్పటికే లక్షాధికారులను చేశామని.. వచ్చే ఐదేళ్లలో మరో 3 కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించి వాళ్లను కూడా లక్షాధికారులను చేస్తామని హామీ ఇచ్చారు.

144 -2

రైతులకు ఇప్పటికే ఉన్న స్కీమ్ లను కొనసాగించడంతో పాటు రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అంటే.. యూరియా, ఇతర పనిముట్లు అన్నీ రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్య్యకారులకు సీ వీడ్ పేరుతో మోదీ గ్యారెంటీ స్కీమ్ ను తీసుకొచ్చారు. 

టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, కూలీలు, ఇతర వర్కర్స్ అందరికీ ఈ శ్రమ్ స్కీమ్ ను తీసుకొస్తామని తెలిపారు. 2025 లోపు విద్యార్థులకు చదువు కోసం ఏకలవ్య స్కూల్, పీఎం జన్ మన్, ఈకో టూరిజం తీసుకొస్తామన్నారు. పర్ ఫార్మ్, రిఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ పేరుతో మోదీ కీ గ్యారెంటీ స్కీమ్ ను ప్రకటించారు. 

ఈజ్ ఆఫ్ లివింగ్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, విశ్వబంధు, సురక్షిత్ భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ హబ్, స్వచ్ఛ భారత్, క్రీడా వికాసం, సంతులిత అభివృద్ధితో మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?