BRS parliament Elections : ఆ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ...ఎందుకంటే...?

BRS parliament Elections : ఆ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ...ఎందుకంటే...?

BRS parliament Elections : రాబోయే లోక్ సభ  ఎన్నికల్లో ఆ స్థానంలోని ఎంపీ సీట్లు ఎలాగైనా దక్కించుకోవాలని విస్తృతస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా పనిచేస్తుంది. దీంతో ఆ సీటు గెలుపు పై ప్రతి ఒక్కరు కార్యచరణ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్న మాట. మరి బీఆర్ఎస్ పార్టీ అంత సీరియస్ గా దృష్టి సారించిన ఆ ఎంపీ టికెట్ స్థానం ఎక్కడ అనే విషయానికొస్తే... బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ సీట్ పై సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాక మెదక్ జిల్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మాజీ మంత్రి హరీష్ రావుకు సొంత జిల్లా కావడంతో ఎలాగైనా  పార్లమెంట్ స్థానంలో ఇక్కడ విజయం సాధించాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. అయితే వాస్తవానికి ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని అంటారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.

20 -2

ఇక ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిచి తీరాలని బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికను రచిస్తోంది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడ గెలిచి తీరాలని పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీష్ రావు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి నేతతో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించిన హరీష్ రావు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామల దృష్ట్యా పార్టీ క్యాడర్ ఎక్కడ నిరుత్సాహ పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది ముఖ్య నేతలు బయటకు వెళ్లడం జరిగింది.

బీఆర్ఎస్ పార్టీ నుండి సీనియర్ లీడర్లు బయటకు వెళ్లిపోయిన సరే పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని మీరంతా పార్టీకి అండగా ఉంటే చాలని సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 6 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని , ఇక ఈ పరిధిలో పార్టీకి 2.4  లక్షల ఓట్ల మెజారిటీ లభించిందని కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు సులభమేనని పార్టీ క్యాడర్  చెప్పుకొస్తున్నారు.

20 -3

ఈ క్రమంలోనే మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డిని ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటన వెనుక కూడా ఓ మతలబ్ ఉంటుందని పలువురు అంటున్నారు. అయితే గతంలో వెంకట్ రాం రెడ్డి పార్లమెంట్ పరిధిలో కలెక్టర్ గా పని చేసిన వ్యక్తి. అంతేకాక ప్రజా ప్రతినిధులకు ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన ఎంపీగా గెలిస్తే విద్యార్థులు చదువు కోసం తాను ఎంపీగా పదవిలో ఉన్నన్ని రోజులు ట్రస్ట్ ఏర్పాటు చేసి 200 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పుకొస్తున్నారు.

కావున తనకు పట్టు ఉన్న ప్రదేశంలో పార్టీ ఓటమి పాలు కాకుండా చూసుకోవాలని ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ జెండా మెదక్ జిల్లాలో ఎగరేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కావున ప్రతి ఒక్క నాయకులు మెదక్ ఎంపీ స్థానంపై గులాబీ జెండా ఎగిరేలా కృషి చేయాలని ఒకరికొకరు చెప్పుకుంటూ వస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?