KTR React on Phone Taping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు...ఇవ్వన్ని రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలే...

KTR React on Phone Taping: ఫోన్ టాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు...ఇవ్వన్ని రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలే...

 

KTR React on Phone Taping : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోన్ టైపింగ్ కేసులో రోజురోజుకు కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పేర్లు తెరమీదకి వస్తున్నాయి.

ఇక ఈ కేసు విషయంలో పోలీసులు మాత్రం చాలా చురుగ్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోన్ టాపింగ్ కు సంబంధించిన హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసి వాటిని ప్రణీత్ రావు అండ్ కో తీసుకువెళ్లి మూసి నదిలో వేయడం జరిగింది.  కానీ ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మూసి బ్రిడ్జ్ కింద వాటిని వెతికి మరీ తీసుకుని వచ్చారు.  

ఈ నేపథ్యంలోనే ముందు ముందు ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో దిగ్బ్రాంతకరమైన విషయాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కల్వకుంట్ల తారకరామారావు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని ఆయన ఆరోపించారు.  అయితే ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం గురించి కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని లేకుంటే వారి పార్టీ దీనిలో కూరుకుపోతుంది అంటూ పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. 

281 -2

అయితే ప్రస్తుతం ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం అనేది అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఏమాత్రం తప్పించుకోలేనట్లుగా తయారవుతుంది.  అయితే ప్రణీత్ రావు తో మొదలైన ఈ టాపింగ్ కేసులో ఇప్పటికే ఎస్.ఐ.బి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరియు పలువురు పోలీసులు ఉన్నతాధికారులు కూడా చిక్కుకున్నారు.

 వారి నుండి పూర్తి విషయాలను తెలుసుకుంటూ పోలీసులు ఈ కేసు పై వివరాలను చక్కగా సేకరిస్తున్నారు.  అయితే అధికారుల విచారణలో కొందరు భారస నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోన్ టాపింగ్ ద్వారా సేకరించిన ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా ఇద్దరు ముఖ్యమైన నేతలకు పంపించేవారమని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అప్పటి బీజేపీ ని కూడా ఈ కేసులో చేర్చాల్సిందిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.  ఇక బీజేపీ నాయకులైతే ఈ ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ ను మొదటి నిందితుడుగా చేర్చాలంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఈ విధంగా సాగుతుంటే ఈ వ్యవహారంపై  కేటీఆర్ చెబుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి.

281 -3

6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేక , రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా , ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ విధంగా ఫోన్ టాపింగ్ కేసును అడ్డంగా పెట్టుకుని ప్రతిరోజు దీనిపై వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  

ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బయటకు వస్తున్న వ్యవహారాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న లీకులే తప్ప వాస్తవాలు అస్సలు కాదని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకులు ఎవరూ కూడా ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై పెద్దగా నోరు ఇప్పింది లేదు.  పూర్తిగా బీ.ఆర్.ఎస్ నాయకుల పేర్లు బయటకు వచ్చిన తర్వాతే వారు పెదవి విప్పాలని యోచిస్తున్నట్లుగా ఉంది.  

అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ను నిందించడానికి ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని కేటీఆర్ వాడుకుంటున్నాడని ముందు రోజుల్లో ఈ కేసులో వారే చిక్కుకునే అవకాశం ఉందంటూ పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  మరి ఈ వ్యవహారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?