Pawan Kalyan : ముఖ్యమంత్రి పదవిపై పవన్‌కు ఆశ లేదా? కూటమి గెలిస్తే పవన్ సీఎం అయ్యే చాన్స్ లేదా?
ఇంకో వారం రోజులు గట్టిగా ప్రచారం చేస్తేనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే అవకాశం ఉందని.. ఈ వారం పది రోజులు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ మునిగి తేలుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అధినేతలే రంగంలోకి దిగి ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Pawan Kalyan : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీదనే భారం
నిజానికి కూటమిని గెలిపించే బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదనే పడింది. ఇద్దరూ కలిసి రాష్ట్రమంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి గెలుపు బాధ్యతను మీద వేసుకున్నారు.
ఒకవేళ కూటమి గెలిస్తే ఏపీలో సీఎం ఎవరు అంటే అందరూ టక్కున చంద్రబాబు అంటారు. కానీ.. కూటమి గెలుపు బాధ్యత తీసుకున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి.. అంటే ముఖ్యమంత్రి పదవిపై ఏకంగా జనసేన అధినేతే తాజాగా స్పందించారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి అని జగన్ అడిగారు. దీంతో ఏపీ ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారు. కానీ.. మీ భవిష్యత్తు కోసం ఇంకో చాన్స్ తీసుకోండి. జగన్ ప్రజలను మోసం చేశారు. ఆయన నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసమే నేను వచ్చాను అని పవన్ అన్నారు.
నేను ముఖ్యమంత్రిని అవుతానా? లేదా? అనేది కాలం నిర్ణయిస్తుంది. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. అంటే కూటమి అధికారంలోకి వస్తే పవన్ ముఖ్యమంత్రి అవుతారా? కాదా? అనే దానిపై ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.
దీనిపై పవన్ కళ్యాణ్ కు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబే కన్ఫమ్ గా ముఖ్యమంత్రి అవుతారు. మరి ఇంత కష్టపడ్డ పవన్ పరిస్థితి ఏంటి. మంత్రి పదవో.. డిప్యూటీ సీఎం పదవో ఇస్తే సరిపోతుందా? ఇదే ప్రస్తుతం ఏపీ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న.
కూటమి గెలుపు కోసం చంద్రబాబుతో పాటుగా తిరుగుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సీఎం జగన్ పై కత్తులు నూరుతున్న పవన్ కళ్యాణ్ కు ఒకవేళ కూటమి గెలిస్తే ఒరిగేదేంటి. కనీసం ఓ సంవత్సరం, రెండేళ్ల పాటు అయినా పవన్ కు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే బాగుంటుంది.. అని జనసైనికులు, పవన్ అభిమానులు కోరుతున్నారు.
మరి.. కూటమి గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో? తన శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుందా లేదా? పవన్ ను ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలు చూడగలుగుతారా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.