KTR : పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి  కేటీఆర్

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి

KTR :  పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణ రెడ్డిని గెలిపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు కోరారు. న‌ల్ల‌గొండ‌లో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీ రామారావు హాజరై మాట్లాడారు. ఓటమిపై బాధ పడొద్దు అన్నారు.

రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమన్నారు. ఓటమి ఛాలెంజ్గా తీసుకొని రెట్టింపు ఉత్సాహం తో పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. మేము ఇచ్చిన ఉద్యోగాల కు సీఎం రేవంత్ ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతున్నాడు అని, ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయాం అన్నారు. నిరుద్యోగులను, ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందింది అన్నారు. కేసీఆర్ ఉన్నన్నీన్నాళ్ళు అన్నదాతలకు స్వర్ణయుగం అయింద‌న్నారు.

న‌ల్ల‌గొండలో చివరి భూములకు కూడా నీళ్టిచ్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఇకనైనా మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుందాం అన్నారు. ఉమ్మడి నల్గొండ లో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తా పడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింద‌న్నారు. మళ్ళీ ఉళ్ల‌ల్లో బోర్ వెల్ బండ్ల మోతలు వినబడుతున్నాయ‌ని అన్నారు. రైతుల రుణమాఫీ చేస్తాం అని కాంగ్రెస్ మోసం చేసింది.

2 -3

ఇవ్వాళ బ్యాంక్ లు  అన్నదాతలను పిడిస్తున్నాయ్.. రైతుబంధు ఇవ్వకుండా  మోసం చేశారు అన్నారు. కోమటిరెడ్డి అన్నదాతలను చెప్పుతో కొడతాం అంటాడు. ఉత్తమ్ ఏమో రైతు బంధు దుబారా అంటున్నాడు. ఇప్పుడు అన్నదాతలు కాంగ్రెస్ వాళ్ళను చెప్పుతో కొట్టాలని, ఎంపీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని, న‌ల్ల‌గొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న అంటున్నాడు.

నువ్వేమైన  జేబు దొంగవా అని అడుగుతున్న అన్నారు. రేవంత్ రెడ్డికి, ఖమ్మం, నల్ల‌గొండ‌ కాంగ్రెస్ నేతలతోనే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అన్నారు. నీ పార్టీలోనే ఎక్ నాథ్ షిండే లు ఉన్నారు. రేవంత్ జాగ్రత్తగా ఉండు. పొంకణాల రెడ్డి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. 420 హామీలు నెరవేర్చే దాకా  నిన్ను వదలం. పోరాటం చేస్తాం అని హెచ్చరించారు. కేసులు త‌ప్పించుకునేందుకు పార్లమెంటు ఎన్నికల అనంత‌రం బీజేపీ లోకి పోయే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని జోష్యం చెప్పారు. 

సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కనీస సోయి లేదు. అన్నదాతలు చస్తున్నా పట్టింపు లేదు. అక్రమ కేస్ లు పెట్టుడే కాంగ్రెస్ కు అలవాటు అయింది. కేసుల‌తో మమ్ములను భయపెట్టాలని చూస్తున్నారు అని విమర్శించారు. కాంగ్రెస్ దొంగలు ఫోన్ ట్యాపింగ్ అంటూ నానా యాగీ చేస్తున్నారు. ఒక్కటి కూడా నిజం కాదు. బధనామ్ చేసుడే కాంగ్రెస్ నైజం. కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

2 -2

కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడ తిరగనియ్యం. ఎక్కడికక్కడ నిలదిస్తాం. ఇక కేసీఆర్ ప్రతాపం చూస్తారు. కేసీఆర్ అంటేనే భరోసా.. ధైర్యం.. కేసీఆర్  భరోసా ఇవ్వగానే అన్నదాతలు చాలా ధైర్యం గా ఉన్నారు. పోరాటం చేద్దాం అని పిలుపు 
నిచ్చారు. పనికి రాని చెత్త ఇప్పుడు పార్టీ నుండి బయటకు పోతుంది. ఎవ్వరు పార్టీ మారినా ఎం నష్టం లేదు. సాగర్ డ్యామ్ పైకి పొయ్యి దమ్ము లేదు కాంగ్రెసు వాళ్లకు సాగు నీళ్లు ఇవ్వంటే తప్పించుకు తిరుగుతున్నరు.

కాంగ్రెస్ వాళ్లు కాంగ్రెస్ నాయకులకు చెప్పులతో సమాధానం చెప్పేందుకు  రైతులు   సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, నల్లగొండ టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?