Barrelakka : పెళ్లైనా.. తగ్గేదెలే..? నాగర్ కర్నూల్ లోక్ సభ నుంచి బర్రెలక్క పోటీ..?
ఈ పోస్టు చేసినందుకు అప్పటి ప్రభుత్వం ఆమెపై కేసు పెట్టింది. ఇది కూడా ఆమెకు ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు బాగా కలిసి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని, ఇది ఒక్క బర్రెలక్క సమస్య కాదని, నిరుద్యోగులందరి కోసం కొట్లాడుతున్నట్లు ప్రచారంలో పేర్కొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని బర్రెలక్క ధీమా వ్యక్తం చేస్తోంది. అవసరమైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని గెలిచే వరకూ పోరాడుతూనే ఉంటానని చెబుతోంది. చట్ట సభల్లో అడుగు పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తాని హామీ ఇస్తోంది. అయితే ఆమెకు ఇటివలే మార్చి 28న వివాహం జరిగింది.
అయినా ఇచ్చిన మాటను వెనక్కి తగ్గేదెలే అంటోంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని చెబుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో 4వ విడుత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా ఆమె నామినేషన్ ఎప్పుడు వేస్తారనేది తెలియాల్సి ఉంది.
అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని ఆమె ప్రచారం చేసుకోవడం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటోంది. ఎలాంటి కేసులు, నిరంకుశం, నిర్బంధాలు లేవని పదే పదే చెబుతోంది. అందులోనూ ఆమెకు అప్పుడు వివాహం కాలేదు.
పెళ్లైన తర్వాత కూడా ఆమె ఎన్నికల్లోకి రానుండడంతో ఆమెకు చరిష్మా తగ్గుతుందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. గతంలో మాదిరిగానే ఆమెకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే..