Pawan kalyan Vs Vanga geetha : పిఠాపురంలో వంగ గీతాను ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ డ్రామా..?
కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రోజురోజుకు రాజకీయ రంగానికి భారం అవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ తెలియడం లేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో స్వయం స్తుతి ,పరనింద తప్ప మరేమీ ఉండడం లేదని పలువురు అంటున్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలోని టీడీపీ మరియు జనసేన శ్రేణులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... సంచలన కామెంట్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లను కలవాలని కోరిక ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలని కోరిక ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ భద్రత కారణాల వలన ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
జనం ఎక్కువమంది గుమ్మి కూడినప్పుడు కిరాయి మూకలు సన్నని బ్లేడ్లు తీసుకువచ్చి నన్ను నా సిబ్బందిని గాయపరుస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు మనకు తెలిసిందే కదా అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అయితే గత ఏడాది జూన్ నెలలో కాకినాడ జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో కూడా తనకి ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ సంచల కామెంట్స్ చేయడం జరిగింది.
అంతేకాక 2019 ఎన్నికల ముందు కూడా లోకేష్ తనకు ప్రాణహాన్ని తలపెట్టారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలన్నీ కూడా సానుభూతి పొందే సినిమా డైలాగ్స్ తప్ప వాస్తవాలు కాదని పలువురు విశ్లేషకులు చెబుతున్న మాట. పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వంగ గీతను ఎదురుకోలేక పవన్ ఈ విధంగా ప్రాణహాని అంటూ సానుభూతి పొందే డ్రామా ఆడుతున్నారని అధికారపక్ష నేతలు మండిపడుతున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీతను చూసి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడని దానికి నిదర్శనం బ్లేడుతో దాడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దమ్ముంటే ఎన్నికల్లో గీత ను నేరుగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి సానుభూతి నీచపు సినిమా డైలాగ్స్ చెప్పి ప్రజల్ని మోసం చేయకంటూ అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బ్లేడుతో తనని గాయపరచడం సంగతేమో కానీ , పవన్ కళ్యాణ్ సానుభూతి కోతలు కోస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ పలువురు సేటైర్లు వేస్తున్నారు. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.