Hyderabad Voters : ఓటేయడంలో హైదరాబాదీలు మరోసారి బద్ధకించారు.. ఎందుకంటే..
13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల కల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 7 గంటలు దాటినా కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగింది. అక్కడక్కడ పలు చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగినట్లు సీఈఓ వికాస్ మీడియాకు తెలిపారు.
Hyderabad Voters : మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు..
కాగా అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే హైదరాబాద్ పరిధిలో చంపాపేటలోని ఓ పోలింగ్ కేంద్రం ఓటర్లు రాకపోవడంతో మధ్యాహ్నం వరకూ బోసిపోయింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో నివసించే ప్రజలు నిత్యం ఉరుకులు, పరుగులు మధ్య జీవనం గడుపుతారు. దీంతో వీరు ఎక్కువగా విశ్రాంతి కోరుకుంటారు. ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు ప్రతిసారి ఎన్నికల్లో పాల్గొనేందుకు అంతగా సుముఖంగా కన్పించరు. ఎన్ని విధాలుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేసినా ఫలితం దక్కడం లేదు.
ఎన్నికల సందర్భంగా సెలవు ప్రకటించినప్పటికీ ఇంట్లో నుంచి కదలకుండా హాయిగా రెస్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. హమ్మయ్య ఎన్నికల పుణ్యమా అని విశ్రాంతి దొరికిట్లు భావించి పోలింగ్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలకు మరో సమస్య ఏంటంటే పోలింగ్ కేంద్రాల అడ్రస్ గల్లంతు ఎక్కువగా ఉంటుంది.
గ్రామాలలో పోలింగ్ మాదిరిగా ఒకే చోట ఉండదు. ఇక్కడ నివసించే వారు ఎక్కువగా కిరాయి ఇండ్లల్లో ఉంటారు. తరచూ ఇండ్లు మారడంతో అడ్రస్ గల్లంతువుతుంది. ఓట్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి రావడంతో సమస్యలు వస్తున్నాయి. కిరాయి ఇండ్లల్లో నివసించే వారు ఖాళీ చేసి వెళ్లినప్పుడు వారి ఓటు తొలగించకపోవడం కూడా మరో సమస్యగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే వీరు అడ్రస్ మారినప్పుడు కొత్త ఓటు కోసం నమోదు చేసుకుంటారు. దీంతో నకిలీ ఓట్ల సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం తక్కువ కావడానికి మరో కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వలసలు రావడం.. ఎందుకంటే వలసలు వచ్చిన వారికి అందరికీ రెండు చోట్లలో ఓట్లు ఉండడంతో వారు ఎక్కువ మొత్తంలో తమ సొంతూర్లకు వెళ్లి అక్కడ ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.
దీంతో హైదరాబాద్ ప్రాంతంలో ఓటు వేయలేకపోతున్నారు. ఇది కూడా ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడానికి కారణం అని చెబుతున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో నివసించే వారిలో ఎక్కువ శాతం ముస్లింలు ఉంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఓటర్ల పేర్లు ఎక్కువగా ఒకే విధంగా ఉండడంతో ఓటు వేసేందుకు వెళ్లే సరికే ఎవరో ఒకరు అతడి పేరుమీద ఓటు హక్కు వినియోగించుకోవడం తరచూ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఓట్లు వేసేందుకు అందరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా సాధారణంగా ముస్లిం మహిళలు బయటకు రావడానికి ఎక్కువగా ఇష్టపడరు. దీంతో వారు ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇండ్ల నుంచి బయటకు రావడానికి సుముఖత చూపకపోవడం మరో కారణంగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.