AP Elections – KCR : ఏపీలో ఆ పార్టీదే గెలుపు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ పార్టీ గెలుస్తుంది అని చెబుతున్నాయి కానీ.. వాటినీ నమ్మే పరిస్థితి లేదు. కొన్ని సంస్థలు ప్రత్యేకించి సర్వే చేపట్టి చెప్పినా కూడా జనాలు నమ్మడం లేదు. కొన్ని సర్వే సంస్థలతో కావాలని కొన్ని రాజకీయ పార్టీలు సర్వే చేయించుకొని తమ పార్టీయే గెలుస్తుందని చెప్పించుకునే ప్రయత్నాలు చేశాయి.
AP Elections – KCR : ఏపీ రాజకీయాలపై మరోసారి స్పందించిన కేసీఆర్
ఇక.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తేరుకొని మళ్లీ పార్టీకి పునరుత్తేజం తేవడం కోసం కేసీఆర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజానికి తమ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఈసారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. కేవలం తెలంగాణ నుంచి ఎంపీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఓ టీవీ చానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్నికలపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని కేసీఆర్ ను యాంకర్ ప్రశ్నించారు. ఏపీలో ఎవరు గెలుస్తారు అని నేరుగానే యాంకర్ ప్రశ్నించడంతో.. ఓవైపు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత ఏపీలో ఎవరు గెలిచినా కూడా తమకు మాత్రం ఒరిగేది ఏం లేదన్నారు.
ఎవరు గెలిచినా తాము పట్టించుకోమని చెప్పిన కేసీఆర్.. ఎవరికి అదృష్టం ఉంటే.. వాళ్లు గెలుస్తారు. కానీ.. మాకు కూడా సమాచారం వచ్చింది. ఏపీలో గెలవబోయేది ఎవరో మాకు ఒక అంచనా కూడా వచ్చింది. మా సమాచారం మేరకు.. జగన్ గెలుస్తారని తెలుస్తోంది అని కేసీఆర్ చెప్పారు.
జగన్ గెలుస్తారని తెలుస్తోంది అని చెప్పిన కేసీఆర్.. ఎవరు గెలిచినా తమకు మాత్రం బాధ లేదన్నారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీ నేతగా ఓ పార్టీకి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు కేసీఆర్. మన రాష్ట్రం కాదు.. వాళ్ల రాష్ట్రం వాళ్లే రాజకీయాలు చేసుకుంటారని స్పష్టం చేశారు.
అయితే.. ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? అని యాంకర్ ప్రశ్నించడంతో.. ఏపీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేయడం లేదని.. ప్రస్తుతానికి పోటీ చేసే ఆలోచన లేదని.. భవిష్యత్తులో అయితే ఏపీలో పోటీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.
నిజానికి ఏపీలో చంద్రబాబుతో కంటే కూడా జగన్ తోనే కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో జగన్ గెలుపు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశారని అంటారు.
ఈనేపథ్యంలో ఏపీలో జగన్ గెలుస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.