Tera Chinnapareddy: బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్.. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా
నల్లగొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బి ఆర్ఎస్
అధిష్టానాన్ని కోరారు. బీఆర్ఎస్ అధిష్టానం సైతం చిన్నపరెడ్డిని నలగొండ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడానికి సమంజసం అని భావించింది. కానీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బిజెపిలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరగడంతో చిన్నపరెడ్డి పేరును పక్కన పెట్టింది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడంతో భువనగిరి టికెట్ ఇచ్చిన తాను పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 15 రోజుల క్రితమే హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని నలగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి బిజెపి పార్టీలోకి వస్తారని చర్చ జరగడం ఎంపీ టికెట్ సైతం ఇస్తారని చర్చ కొనసాగింది.
బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి ప్రకటించడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నాయకులు రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. చిన్నపరెడ్డి బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని చర్చ కొనసాగుతుంది. అయితే ఆ పార్టీలోకి వెళ్లినా టికెట్ వచ్చే పరిస్థితులు లేవు. తన వ్యాపారాలను కొనసాగించడానికి బీజేపీలోకి వెళ్లడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది.