BJP Craze : తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పార్టీపై సానుకూలత...తేల్చి చెప్పిన ప్రముఖ సర్వేలు...
ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీలు పలు రకాల కార్యక్రమాలను బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇక ఈ సమయంలోనే లోక్ సభ ఎన్నికలపై ప్రముఖ మీడియా సంస్థ ఆన్ లైన్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇక దీనిలో వెలువడిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే....
దీనిలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టం, ప్రధాని పదవి అర్హత , రామ మందిర నిర్మాణం , అవినీతిని అరికట్టడం , ధరల పెరుగుదల , అలాగే నిరుద్యోగం , మణిపూర్ వంటి అంశాలపై పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమైనట్లుగా చెబుతున్నారు. మరి ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పౌరసత్వ సవరణ చట్టం...
మోడీ ప్రభుత్వం ఇటీవల ఈ సిఏఏ అనే చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి కలిసి రానుందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 54.03 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 15.25 మంది ప్రజలు బీజేపీ కి కలిసి రాదని తెలియజేశారు. అదేవిధంగా 30.72 శాతం మంది ఎలాంటి ప్రభావం ఉండదని అభిప్రాయ వ్యక్తం చేశారు.
ప్రధానిగా ఎవరైతే బెటర్...
ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయాలని బీజేపీ భావిస్తుండగా మోడీకి ఇదే లాస్ట్ ఛాన్స్ అవ్వాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో తాజాగా చేసిన సర్వేలో పాల్గొన్న తెలుగు వారు 79.31 శాతం మంది మోడీ మరోసారి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక 15.52 శాతం మంది రాహుల్ గాంధీ , 3.45 శాతం మంది మల్లికార్జున ఖార్గే , 1.72 శాతం మంది నితీష్ కుమార్ ప్రధాని అయితే బాగుంటుందని అభిప్రాయ వ్యక్తం చేశారు.
నరేంద్ర మోడీ వర్సెస్ ఇండియా కూటమి...
ఇండియా కూటమి అధికార పార్టీ బీజేపీని తట్టుకుని నిలబడలేదని 73.8% మంది తెలుగువారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమికి మద్దతుగా 17.34 శాతం మంది అభిప్రాయాలను వెల్లడించారు. 8.86% మంది ఏం జరుగుతుందో చెప్పలేమని చెప్పారు.
హామీలను నెరవేర్పటం...
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో మోడీ ప్రభుత్వం ముందుందని తాజాగా చేసిన సర్వేలో వెళ్లడైంది. దీనిలో భాగంగానే 60.62 శాతం మంది మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చయాని తెలియజేశారు. 26.20% మంది ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని , 12.18 మంది ఏమి చెప్పలేమని తెలియజేశారు.
అవినీతిని అరికట్టడం....
అవినీతిని అరికట్టే విషయంలో మోడీ ప్రభుత్వం విజయవంతమైందని ఈ సర్వేలో 47.21 % మంది అంగీకరించారు. 38.66 % మంది అవినీతిని అరికట్టలేదని అభిప్రాయ పడగా.. 14.03 మంది ఏమి చెప్పలేమని తెలియజేశారు.
రామ మందిరం...
మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలలో రామ మందిరం నిర్మాణం ఒకటి. ఇక ఈ హామీలను నెరవేర్చడంపై 30.93% మంది తెలుగువారు సదాభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో మోడీ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదల అతిపెద్ద పరాజయమని 37.64 శాతం మంది తెలియజేయగా , నిరుద్యోగంపై 19.39 శాతం మంది
, మణిపూర్ వివాదంపై 27.38 శాతం మంది , అదేవిధంగా ఇందన ధరలపై 15.55 శాతం మంది బీజేపీ పార్టీకి ఇది పరాజయంగా పేర్కొన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. మరి ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.