Feroze and Indira Gandhi :ఫిరోజ్ , ఇందిరా గాంధీ మధ్య అసలేం జరిగింది .. వారిద్దరి మధ్య గొడవలకు కారణాలు ఏంటి..? 

 Feroze and Indira Gandhi  :ఫిరోజ్ , ఇందిరా గాంధీ మధ్య అసలేం జరిగింది .. వారిద్దరి మధ్య గొడవలకు కారణాలు ఏంటి..? 

 ఇందిరాగాంధీ తన పిల్లలతో కలిసి అలహాబాద్ లోని తన ఇంటిని వదిలి తన తండ్రికి చెందిన ఆనంద్ భవన్ ఇంటికి వచ్చారు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇది తాత్కాలికం కాకపోవచ్చు కానీ 1955లో ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. అదే సంవత్సరంలో ఇందిరాగాంధీ కూడా పార్టీ వర్కింగ్ కమిటీలు కేంద్ర ఎన్నికల సంఘంలో తనకు చోటు దక్కింది.

ఆ రోజుల్లో కాంగ్రెస్ కు పార్లమెంటులో  ఎక్కువ మెజారిటీ ఉంది. అప్పటి ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా, చిన్నవిగా ఉన్నాయి. ఈ సమస్యల వల్ల కొత్తగా మొదలుపెట్టిన భారత రిపబ్లిక్ లో ఒక రకమైన శూన్యం ఉంది అని చెప్పొచ్చు. ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చాలా దగ్గర వాడు. పార్లమెంట్ సభ్యుడు ఫిరోజ్ కు అనధికార ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. దాంతో దేశంలో నిరసన గళం చేపట్టిన మొదటి నాయకుడు కూడా ఆయనే.

ఆయన ఎంతో జాగ్రత్తగా చేపట్టిన అవినీతి ఆరోపణల కారణంగా ఎంతో మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక బీమా పరిశ్రమను కూడా జాతీయం చేయాల్సి వచ్చింది. ఈ కారణాల వల్ల ఆర్థిక మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాక ఫిరోజ్ గాంధీ చేస్తున్న కృషి ఆయన మామగారైన అప్పటి ప్రధాన జవహర్ లాల్ నెహ్రూ కు ఏమాత్రం నచ్చలేదు..

ఫిరోజ్ చర్యలను పార్లమెంట్లో ఇందిరా ఎప్పుడూ ప్రశంసించలేదు. తన భార్య అయిన ఇందిరా నియంతృత్వ ధోరణిని ఫిరోజ్ గాంధీ గుర్తించాడు. 1959లో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. అలాంటి టైం లో కేరళలో మొట్ట మొదటగా ఏర్పాటు చేసిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆమె రద్దు చేయటమే కాక రాష్ట్రపతి పాలన విధించింది. ఈ సందర్భంగా ఒకరోజు ఆనంద్ భవనంలో ఉదయం అల్పాహారం చేస్తుండగా, జవహర్ లాల్ నెహ్రూ ఉండగా ఇందిరా గాంధీని ఫిరోజ్ పాసిస్టు అని అన్నాడు.

ind 1

ఆయన తర్వాత చేసిన ఒక ప్రసంగంలో ఎమర్జెన్సీ రావచ్చు అని ముందుగానే అంచనా వేశాడు. అప్పట్లో పార్లమెంట్ లో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ పాత్రికేయులు ఎవరైనా దాని గురించి మాట్లాడిన రాసిన వారిని శిక్షించేవారు. భావ ప్రకటన స్వేచ్ఛను ఫిరోజ్ గాంధీ చాలా బలంగా నమ్ముతాడు. వీటన్నిటిని పరిష్కరించటానికి ఫిరోజ్ గాంధీ ఒక ప్రైవేటు బిల్లును చేపట్టాడు. చివరికి అది చట్ట రూపం దాల్చి ఫిరోజ్  గాంధీ ప్రెస్ లా పేరుగాంచింది .

ఇది చట్ట రూపం దాల్చటానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఫిరోజ్ గాంధీ చనిపోయిన తర్వాత 15 సంవత్సరాలకు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇందిరాగాంధీ ఆ సమయంలో  ఈ చట్టాన్ని చెత్తబుట్టలో పడేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం మళ్లీ ఆ చట్టాన్ని మొదలుపెట్టింది. మనం ఇప్పుడు పార్లమెంటులో జరిగే కార్యకలాపాలన్నింటిని రెండు టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నామంటే దానికి కారణం ఫిరోజ్ గాంధీనే.

ఇదిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ ఎన్నో విషయాలలో గొడవలు పడేవారు. అంతేకాక పిల్లల పెంపకం విషయంలో కూడా వారికి భిన్నభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయంలో కూడా వారిద్దరికీ అభిప్రాయాలు వేరుగా ఉండేవి. ఇందిరాగాంధీ, నేను ఎన్నో సంవత్సరాల పాటు  స్నేహ పూర్వకంగానే వాదించుకునేవాళ్ళం. ఇతర వాదనలను కూడా మనం గౌరవించాలి వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉండనివ్వాలి అనేది నా అభిప్రాయం.

కానీ ఇందిరా అధికారాలు మొత్తం తన చేతిలోనే ఉండాలి అనుకునేది. ఇందిరా ఫెడరల్ విధానానికి వ్యతిరేకంగా ఉండేది. ఆ విధానాల వల్ల దేశం అభివృద్ధి చెందదు అని ఆమె భావించేది అని మేరీ సెల్వ నర్క్  చెప్పారు..ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మేరీ. నేను ఫిరోజ్ ని రెండు మూడు సార్లు కలిసినప్పటికీ ఆయనతో ఎప్పుడు చనువుగా మాట్లాడలేదు.  ఎందుకంటే ఇందిరా కు అది  ఇష్టం ఉండదు అని నా అభిప్రాయం.

కానీ పరిపాలన విషయంలో ఇందిరా ఆలోచనలకు ఫిరోజ్ గాంధీ వైఖరికి ఏ మాత్రం పొంతన ఉండదు అని మేరీ  చెప్పారు. ఎన్నో విషయాలలో భిన్నభిప్రాయాలు ఉన్న వీరిద్దరూ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంగా ఉండేవారు. అదే ప్రకృతి పట్ల ప్రేమ, తోట పనిలో ఆసక్తి ఎక్కువగా ఉండేది.1943 నవంబర్ 22న ఇందిరాగాంధీ ఒక లేఖలో దీని గురించి రాశారు. అహ్మద్ నగర్ ఫొర్ట్ జైల్లో ఉన్న  తన తండ్రి కి రాసిన లేఖలో ఫిరోజ్ తోట పని గురించి బాగా రాశారు.

1943 నవంబర్ 22న రాసిన లేఖలో ఇప్పుడే నేను తోట నుంచి వచ్చాను. ఒకప్పుడు అక్కడ కలుపు మొక్కలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పచ్చిక బయలు ఎక్కువగా ఉన్నాయి. పూల మొక్కలతో మొక్కలు అన్ని చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇదంతా ఫిరోజ్ వల్లనే  సాధ్యమైంది అని అన్నారు. ఇందిరాను ఫిరోజ్ మోసం చేశాడని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి.అలాంటి సమయంలోనే కొందరు ఇందిరాతో సంబంధాలు ఉన్నాయి అని గొప్పలు చెప్పుకునే వారు.

కానీ ఇందిరా గాంధీ,ఫిరోజ్ గాంధీ ఇద్దరు భారతా అభివృద్ధికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇస్తే అవన్నీ అబద్ధం గా కనిపిస్తాయి. ఎన్నో అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారిద్దరి బంధం గాఢంగా పేన వేసుకున్నదే అని చెప్పవచ్చు. కేరళ విషయాని కొస్తే ఫిరోజ్ గాంధీ తీసుకున్న నిర్ణయం ఇందిరా గాంధీకి ఒక హెచ్చరిక లాంటిది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ముగియటానికి ముందే ఆమె రాజీనామా చేసింది. దాని తర్వాత ఇందిరాగాంధీ,ఫిరోజ్ గాంధీ పిల్లలిద్దరిని తీసుకొని ఒక నెల సెలవులు గడపటానికి కాశ్మీర్ వెళ్లారు. తమ తల్లిదండ్రుల మధ్య సమస్యలు ఉన్న ఆ సందర్భంగా మర్చిపోయారు అని రాజీవ్ గాంధీ చెప్పారు. పర్యటన నుంచి వచ్చిన కొద్ది రోజులకే ఫిరోజ్ గాంధీ మరణించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?