Chandrababu – Pawan Kalyan : రైతు కన్నీళ్లు తుడిచే కూటమి మాది.. అంబాజీపేట ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్
తాజాగా.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా పలు సభల్లో పాల్గొన్నారు. అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఇద్దరూ పాల్గొన్నారు. అంతకుముందే పి గన్నవరం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Chandrababu – Pawan Kalyan : బాలయోగి నాకు చిరకాల మిత్రుడు
ఒక చాన్స్ ను నమ్మి మీరంతా ఓట్లేశారు. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. మీలో ఒక బాధ, ఆవేదన, అక్రందన, అభద్రతా భావం ఉంది. నేను, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికే. మీ జీవితాల్లో వెలుగులు నింపడానికే వచ్చాం. ఇది తప్పకుండా సాధిస్తామన్నారు చంద్రబాబు.
సిద్ధం, సిద్ధం అంటున్న వాళ్లకు మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్లు.. ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. నాకు చిరకాల మిత్రుడు బాలయోగి. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి. ఆయన చనిపోయారు కానీ.. మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. కోనసీమకు ఆయన చేసిన అభివృద్ధి అదే. ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీదే అన్నారు చంద్రబాబు.
ఈరోజే మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి. ఈ నెలలో ముగ్గురు మహనీయులు పుట్టారు. మొన్న జగ్జీవన్ రావు జయంతి, ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి జరుపుకుంటున్నాం. ఈనెల 14న అంబేద్కర్ జయంతి జరుపుకోబోతున్నాం. ఈ ముగ్గురు నాయకుల సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది.
ఈరోజు బీసీలకు ఒక డిక్లరేషన్ ఇచ్చాం. ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది. 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సంవత్సరానికి 30 వేలు, 5 ఏళ్లలో లక్షా యాబై వేలు ఖర్చు పెట్టి బీసీలకు ఆర్థికంగా బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది అన్నారు.
ఇదే కాదు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ తీసుకొస్తాం. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతాం. న్యాయం చేపిస్తాం. తీర్మానం చేస్తాం.. బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఆదరణ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చుపెడతాం. చంద్రన్న భీమా 15 లక్షలు చేసే బాధ్యత మాది అన్నారు.
5 ఏళ్ల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు, కష్టాలకు చెక్ పెట్టే రోజు వచ్చింది. 5 ఏళ్ల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా? ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 200 కరెంట్ చార్జీ ఉండేది. ఇప్పుడు 2000 అయింది అన్నారు చంద్రబాబు.
ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోనసీమను జగన్ కలహాల సీమగా చేసే ప్రయత్నం చేశారన్నారు పవన్ కళ్యాణ్. ఈకలహాల సీమ కాకుండా, కొట్లాట సీమ కాకుండా అందాల సీమను ప్రేమ సీమగా మార్చుకోవడానికి శాయశక్తులా కృషి చేశామన్నారు పవన్ కళ్యాణ్.
ప్రతి ఒక్క కులానికి నేను అండగా ఉంటాను. సంఖ్యా బలం లేని 127 కులాలు అందరికీ అండగా ఉంటామని హామీ ఇస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. మీ భవిష్యత్తు కోసమే ఈ కూటమి ఏర్పాటు చేశాం. మీకు ఉపాధి అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కూటమి రావాలి. ఇక్కడికి కావాల్సిన పరిశ్రమను నెలకొల్పుదాం. మా ఎన్డీఏ కూటమి రైతు కన్నీళ్లు తుడిచే కూటమి అవుతుంది అన్నారు పవన్ కళ్యాణ్.