AP Elections 2024 : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? పాలిటిక్స్‌కు ఎందుకు దూరమయ్యారు?
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అందరూ ఏపీలోనే తిష్టవేశారు. దానికి కారణం.. ఏపీలో కూటమి గెలుపు కోసం అటు చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నారో.. మరోవైపు బీజేపీ కూడా అంతే ప్రయత్నాలు చేస్తోంది. అందులోనూ ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి.25 ఎంపీ సీట్లలో ఎక్కువ శాతం బీజేపీ గెలుచుకోవాలని.. తద్వారా కేంద్రంలో అధికారంలోకి రావడానికి కావాల్సిన మెజారిటీ పెరుగుతుందని బీజేపీ యోచిస్తుంది.
AP Elections 2024 : చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గల్లా కుటుంబానిది ప్రత్యేక స్థానం
అయితే.. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గల్లా కుటుంబానిది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవచ్చు. గల్లా కుటుంబంలో కీలక నేతగా గల్లా అరుణకుమారి ఉన్నారు. ఆమె చంద్రగిరి నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. చంద్రబాబు సొంత గడ్డపై ఆమె విజయపతాకం ఎగురవేశారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా చాలా ఏళ్ల పాటు వ్యవహరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలోనూ ఉన్నారు. 2014 కు ముందు.. అంటే రాష్ట్ర విభజన సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం తరుపున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
2014 లోనే గల్లా అరుణకుమారి కొడుకు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచారు. కానీ.. 2019 లో టీడీపీ ఓడిపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు మళ్లీ టికెట్ దక్కలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ కు టీడీపీ టికెట్ ఇచ్చింది. దీంతో గల్లా కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తోంది.
అయితే.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అప్పటి నుంచి గల్లా ఫ్యామిలీకి ఇబ్బందులు మొదలయ్యాయి. వ్యాపారపరంగా చాలా ఇబ్బందులకు గురయ్యారు. దీంతో గల్లా ఫ్యామిలీ రాజకీయాలకు దూరం అయింది. నిజానికి గల్లా అరుణ కుమారి తండ్రి పాతూరి రాజగోపాల్ నాయుడు కూడా అప్పట్లో రాజకీయాల్లో రాణించారు. ఆయన కాలం నుంచే గల్లా ఫ్యామిలీ రాజకీయాల్లో రాణించింది.
కానీ.. 2019 నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా ఫ్యామిలీ రాజకీయాల్లో అంతగా కనిపించడం లేదు. గల్లా మాత్రమే కాదు.. చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో రాణించిన శివ ప్రసాద్, గుమ్మడి కుతూహలమ్మ, ఈశ్వర్ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి వారసులు కూడా రాజకీయాలకు స్వస్తి పలికారు. రాజకీయాల్లో రాణించిన వాళ్ల ఫ్యామిలీ నుంచి ఈ జనరేషన్ లో ఎవరు కూడా రాజకీయాల వైపు రావడం లేదు.
దీంతో ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్న చిత్తూరు రాజకీయాలు ఇప్పుడు పెద్దగా రాజకీయాల్లో కనిపించడం లేదు. ఏపీలో ఎన్నికల వేళ కూడా చిత్తూరు జిల్లా రాజకీయాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఏపీలో కీలక పాత్ర పోషించడం లేదు.