PM Modi Vs Hemangi Sakhi : ప్రధాని మోదీకి ట్రాన్స్ జెండర్ నుంచి తలనొప్పి..
ఆల్ ఇండియా హిందూ హిందూ మత పవిత్ర ప్రాంతమైన వారణాసిలో ఈ సారి రసవత్తర పోరు కొనసాగనుంది. ఆల్ ఇండియా భారత హిందూ మహాసభ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలిట హేమంగి సఖి శిఖండిలా దాపురించిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అంటే నాకు శత్రుత్వం లేదని, అయితే లింగ సమానత్వం దిశగా ట్రాన్స్‌జెండర్లు చేస్తున్న పోరాట స్పూర్తితో బరిలోకి నిలిచినట్లు ఆమె చెబుతున్నారు. స్త్రీ పురుషులు సమానం అనేది పాత మాట. స్త్రీ పురుషులతోపాటు నానా రకాలైన ట్రాన్స్‌జెండర్లు కూడా సమానమే అనేది కొత్తమాట అనేది ఈ ఎన్నికల ద్వారా రుజువు అవుతోంది.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన హిమంగి సఖి తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. ప్రఖ్యాత నట ప్రదర్శకుడు రాజ్ కపూర్ తో కలిసి పని చేశారు. సినిమా పనుల కోసం ఆయన ముంబైకి మకాం మారారు. హిమంగి తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె స్కూలు మానేసి కుటుంబ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం.
ఆమె సినిమాలతోపాటు పలు టీవీ షోలల్లో కూడా నటించారు. ఆ తర్వాత ఆమె కృష్ణుడి భక్తిలో లీనమై బాహ్య బంధాలను వదలుకొని బృందావనం చేరుకున్నారు. తన పేరు హేమాంగి సఖిగా మార్చుకుని ఉత్తరాదిలో వేలాది భక్తుల నుంచి గౌరవం పొందారు. కుంభమేళాలో ఆమె ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంటారు.
కీర్తనలు, భజనలు ఆలపిస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. నేను నా దేహాన్ని, హృదయాన్ని, సంపదను శ్రీకృష్ణుడికి సమర్పించుకుంటున్నట్లు ఆమె చెబుతున్నారు. ఆయన తన జీవితాన్ని పూర్తిగా మార్చేశా డని ఆమె పలు సందర్భాల్లో చెబుతుంటారు.