Gali Janardhan Reddy : బీజేపీ గూటికి గాలి జనార్ధన్ రెడ్డి

Gali Janardhan Reddy : బీజేపీ గూటికి గాలి జనార్ధన్ రెడ్డి

Quick Today News Bangalore : కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్‌ రారాజుగా పేరున్న గాలి జనార్దన్ రెడ్డి ఆయ‌న పార్టీని బీజేపీలో విలీనం చేరారు. లోక్‌సభ ఎన్నికల వేళ‌ ఆయన ఈ కీల‌క‌ నిర్ణయం తీసుకున్నారు. గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే..

రాజకీయాలపై ఉన్న ఆసక్తితో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయ‌న‌ కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీతోనే ఉన్న ఆయన ఇలా ప్రత్యేక పార్టీని పెట్టారు. మళ్లీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

త‌న భార్య అరుణ లక్ష్మి,  కుటుంబ సభ్యులతో సహా బీజేపీ సీనియర్ నేత యడియూరప్పని కలిసి బీజేపీలో చేరారు. ఇటీవలే  గాలి జనార్ధన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని కూడా కలిశారు. అయితే..ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆయన మద్దతు ఇచ్చ‌రు.

258 -2

అయితే ఇప్పుడు బీజేపీలో త‌న పార్టీని పూర్తిగా విలీనం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలన్న ఆకాంక్షతోనే బీజేపీలో చేరినట్టు ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యాన‌ని, ఆ సమయంలోనే నా రాజకీయ భవిష్యత్‌ గురించి ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్లు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో బయట నుంచి మద్దతునిచ్చే బదులు పూర్తిగా బీజేపీలో చేరిపోవాలని అమిత్ షా సూచించిన‌ట్లు తెలిపారు. ఆలోచించి నిర్ణయం తీసుకోమని స‌ల‌హా ఇచ్చినందున తిరిగి బీజేపీలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. నా రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే మొద‌లైంద‌ని,, అందుకే మ‌ళ్లీ  సొంత గూటిలో చేరుతున్న‌ట్లు తెలిపారు. నేనింకేదో ఆశించి మాత్రం పార్టీలో చేరడం లేద‌ని, నిజాయతీగా పని చేసేందుకే పార్టీలోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?