AP Volunteers : వాలంటీర్ల విషయంలో చంద్రబాబు సంచలన విషయాలు?... గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

AP Volunteers : వాలంటీర్ల విషయంలో చంద్రబాబు సంచలన విషయాలు?... గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

AP Volunteers :  ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లను అన్ని విధాల పనులు కూడా వాడుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం 5000 రూపాయలు ఇచ్చి  పింఛన్లతో సహా చాలా పనులు చేయించుకున్నారు. ఇక ఏపీలో వాలంటీర్లు వ్యవస్థను గత వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. 

 ఆశయం మంచిదే కానీ వాలంటీర్ల విషయంలో కొంచెం ఆచరణలో గాడి తప్పిందని చంద్రబాబు సర్కారు తెలిపింది. చివరకు ఎంతలా అంటే కచ్చితంగా వారు వైసిపి కార్యకర్తలు లాగా పని చేయాల్సినంత  మార్గంలో కైతే వెళ్లిపోయినటువంటి సంఘటనలు జరిగాయి. చివరికి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో వాలంటీర్లు ఎన్నికల ముందు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వైసిపి నేతలు మాత్రం వారి చేత రాజీనామాలు జయించి అధికారికంగా పార్టీ కోసం పని చేయించుకున్నారు. ఆ విధంగా మొత్తం ఏపీలోని రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో లక్ష మంది దాకా  స్వతగా రాజీనామా చేసి తప్పుకున్నారు. 

Read Also ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ‌ధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి

 అయితే వాలంటీర్లను తమ ప్రభుత్వం వస్తే బాగా చూసుకుంటామని వారికి నెలకు 10,000 గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా సేవలను ఇస్తామని టిడిపి కూటమినేతలు ఎన్నో విధాలుగా ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి  అత్యధిక మెజారిటీతో వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ వాలంటీర్లు విషయంలో అయితే ఎటు తేల్చలేకపోయారు. దాంతో వారు ఉద్యమం బాట పడతామని హెచ్చరిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లు ప్రస్తావన వస్తుంది కానీ అది కూడా ఎటు వెళ్లలేక పోతుంది. వాలంటీర్ల వ్యవస్థ వల్ల వైసీపీకి మంచి కంటే చెడ్డ ఎక్కువగా వచ్చిందని టిడిపి ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమావేశాల్లో ఎలక్షన్లు ముందు చెప్పారు. 

30 I2

 కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో మాత్రం వాలంటీర్లు వ్యవస్థ విషయంలో కచ్చితంగా అభిప్రాయాలు ఉంటాయని అంటున్నారు. వాలంటీర్లను కొనసాగించాలని ఆయన అనుకున్నట్లుగా తెలుస్తుందట. వాలంటీర్లలో నీతి నిజాయితీపరులను చిత్తశుద్ధి కలిగినటువంటి వారిని పనితీరు బాగా తెలిసిన వారిని విద్యార్హతలను బట్టి తీసుకోవాలని  అలాగే వారికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించే సేవలు వాడుకోవాలని బాబు ఆలోచిస్తున్నారని అందరూ కూడా అంటున్నారు. వాలంటీర్లు కొన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఉపయోగించుకోవడం ద్వారా వారి ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారిని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు   టిడిపి నాయకులు చెప్పుకొస్తున్నారు. 

వైసీపీ వాలంటీర్ల విషయంలో చేసిన తప్పులు చేయకుండా బాగా నడిపిస్తే మంచి వ్యవస్థగా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఇక మొత్తం వాలంటీర్లను తీసుకోవడం కంటే రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టి మిగిలిన వారిలో కూడా సరైన ఎంపిక చేసుకొని అవసరమైన మేరకు తీసుకోవడం ద్వారా మాట నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వం కూడా బాగానే ఆలోచిస్తుందట. మొత్తం మీద చూసుకుంటే వాలంటీర్లు వ్యవస్థ తొందర్లోనే పురుడు పోసుకోనుందని అందరూ అనుకుంటున్నారు. 

 ఇక నవంబర్ అరుణ జరిగే మంత్రివర్గ సమావేశాలు ఈ మేరకు ఒక మంచి నిర్ణయం వాలంటీర్లపై తీసుకుపోతున్నారని తెలుస్తున్నట్లు ఉంది. ఈసారి వచ్చే వాలంటీర్లు టిడిపి శిక్షణలో తర్ఫీదు  తీసుకొని  జనంలోకి వెళ్తారని అంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ అనేది మనం కచ్చితంగా చూడవచ్చును. కాబట్టి వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ మంది తీసుకొని ప్రభుత్వ  పనితీరులో వాడుకోవాలని చూస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. చంద్రబాబు ఆలోచనలతో ఈ వాలంటీర్లు  కూడా కొంచెం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు.

30I3

 ఇక ఇన్నాళ్ళ నిరీక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెబుతున్నట్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకు మాత్రం నిరాశే కలుగుతుంది అన్న విషయం అర్థమవుతుంది. తద్వారా ఈ వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం చాలా తెలివిగా ముందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా  ఇచ్చినటువంటి హామీలపై అలాగే ఏమేం చేయాలో ఆలోచనలోనే పూర్తిగా అధికారులనే వాళ్ళు  నిమగ్నమై ఉన్నారు. 

కాబట్టి వాలంటీర్ల  విషయంలో కాస్త లేట్ అయినా సరే చంద్రబాబు మాత్రం ఎవరికీ తెలియకుండా కొన్ని వ్యూహాలు పన్నుతున్నారు. బయటకు తెలియకపోయినా వాలంటీర్లపై లోపల ప్రభుత్వానికి ఉపయోగపడేలా  ఏదో ఒక విధంగా  కొంతమంది వాలంటీర్లను నియమించుకొని వారికి పూర్తిగా స్కిల్స్ అనేవి నేర్పించి 10000 రూపాయలు వేతనాలుగా ఇచ్చి ప్రభుత్వానికి సహాయ పడేటువంటి పనులను చేయించుకునే   ఆలోచనలను కలిగి ఉంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?