Harsha sai: యూట్యూబర్ హర్ష సాయిపై చీటింగ్ కేసు.. నిజ నిజాలు ఏంటో మీకు తెలుసా?
ఒక బాధితురాలు నన్ను మోసం చేశాడు అని హర్ష సాయిపై చీటింగ్ కేసు పెట్టింది. దీంతో ఒక్కసారిగా హర్ష సాయి ఫ్యాన్స్ అందరు అవాక్కైపోయారు. అయితే ఆ బాధితురాలు ముంబై నుండి హైదరాబాద్ కి సినిమాల అవకాశం కోసం వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఆ బాధితురాలుకు హర్ష సాయి పరిచయమై గతంలో ఒక సినిమా కూడా చేశారు. అయితే ఈ మధ్య నన్ను పెళ్లి చేసుకుంటాడని దాదాపుగా రెండు కోట్లను పైగా డబ్బును తీసుకొని నన్ను మోసం చేశాడని హైదరాబాదులోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు హర్ష సాయి పై కేసును నమోదు చేశారు.
హర్ష సాయిపై 328, 376 (2) (n), 354 (B)(C) IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అంతేకాకుండా హర్ష సాయి తండ్రి పైన కూడా కేసు నమోదు చేసినట్లు అబాధితురాలు తెలిపింది. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్, సైబరాబాద్ పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు చేస్తున్నారు. నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అంతేకాకుండా ఆ బాధితురాలను ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.
అయితే హర్ష సాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలిసిన వాడే. తను యూట్యూబ్ ఛానల్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర లాంగ్వేజెస్ లో కూడా నడుపుతున్నాడు. దీంతో ప్రతి ఒక్కరికి హర్ష సాయి అంటే ఎవరో తెలుసు. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్ లో చాలామంది ఫాలోవర్స్ తనని మెచ్చుకుంటూ భారీగా సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న హర్ష సాయి ఇలాంటి పనికి ఎలా ఒడిగట్టాడు అనేది ఫ్యాన్స్ లో తీవ్రమైన దుమారం రేపుతుంది.
అయితే ఈ కేస్ పై హర్ష సాయి కూడా స్పందించడంతో తమ యొక్క ఫ్యాన్స్ అయితే హర్ష సాయి ఇలాంటి పని చేసి ఉండడు అని ఎక్కువ మోతాదులో నమ్ముతున్నారు. అయితే కొంతమంది మాత్రం చేసేవి చెడ్డ పనులు చూపేవి మంచి పనులు అని చాలామంది కామెంట్లు చేస్తు అతనిపై మండిపడుతున్నారు. అయితే ఇంతటి ఘనంగా ఫాలోవర్స్ ను పెంచుకున్న హర్ష సాయి ఇలాంటి పని చేయడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా యావత్ భారతదేశం అంతటా చర్చించుకుంటున్నారు.
ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది. ఎక్కడ చూసినా హర్ష సాయి కేసు కనబడుతుంది. దీంతో హర్ష సాయి ఏ మాత్రం ఫీల్ అయ్యాడో తెలియదు కానీ తమ యొక్క ఫ్యాన్స్ అయితే భారీగా ఆందోళన చెందుతున్నారు. మరి ఈ కేస్ నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే పూర్తిగా విచారణ జరగాల్సిందే. కాబట్టి అప్పటివరకు వేచి ఉండాల్సిందే.