Harsha Sai: జానీ ని పట్టుకున్న పోలీసులు... హర్ష సాయి ని పట్టుకోలేరా?... నిందితురాలు ఆవేదన

Harsha Sai: జానీ ని పట్టుకున్న పోలీసులు... హర్ష సాయి ని పట్టుకోలేరా?... నిందితురాలు ఆవేదన

Harsha Sai: ఈ మధ్య వార్తల్లో ప్రతి రోజు హర్ష సాయి  పేరు వినిపిస్తూ ఉండడం మనం చూసే ఉంటాం. ఒక బాధితురాలని మోసం చేసిన కేసులో హర్ష సాయిని గాలిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు. అంతేకాకుండా  మోసానికి గురైనటువంటి బాధితురాలు చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇన్ని రోజులు పట్టుకోకుండా ఇంకా ఏం చేస్తున్నారని పోలీసులనే నిలదీస్తుంది. నాకు వెంటనే తగు న్యాయం చేయాలని ఆ బాధితురాలు పోలీసులను  కోరుకుంటుంది. 

 హర్ష సాయి అంటే  భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా  తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రతిరోజు యాక్టివ్ గా ఉంటూ  ఎంతోమంది ఫాలోవర్స్ నూ తనవసం చేసుకున్నాడు. హర్ష సాయి పేరు వినగానే సాయానికి మారుపేరు అని కొన్ని సందర్భాల్లో మనం  వినే ఉంటాం. అయితే కరోనా కాలంలో సోనూ సూద్   ఎంతమందికి ఎంతలా సాయం చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 

Read Also AP Volunteers : వాలంటీర్ల విషయంలో చంద్రబాబు సంచలన విషయాలు?... గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

అచ్చం అలానే హర్ష సాయి కూడా రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు భారతదేశంలోని సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇతను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ దాదాపుగా కొన్ని లక్షల సంపాదిస్తూ  అవి పేద ప్రజలకు పంచుతూ ఆ వీడియోలను యూట్యూబ్లో పెడుతూ  తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతోమంది దగ్గర అభినందనలు కూడా పొందాడు.

Read Also ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ‌ధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి

  విశాఖపట్నంలో జన్మించినటువంటి హర్ష సాయి  తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తూ  అది వీడియోలను తీసి యూట్యూబ్లో పెడుతూ  ఎంతో బాగా సంపాదిస్తున్నాడు.  కొన్ని రోజుల క్రితం ఇతను బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోషన్స్ చేస్తున్నట్లు  చాలామంది నిరూపించారు కూడా. అయినా సరే అవన్నీ కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు. 

03 -01

అయితే ఈమధ్య ఒక బాధితురాలు హర్ష సాయి నన్ను పెళ్లి చేసుకుంటానని చీటింగ్ చేశాడు  అలాగే వాళ్ళ నాన్న కూడా నన్ను మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసింది. అయితే నార్సింగి పోలీస్ స్టేషన్లో అప్పట్లోనే హర్ష అయిపోయి కొన్ని సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. కానీ ఇప్పటికీ హర్ష సాయి జాడను మాత్రం కనుగొనలేకపోయారు. 

 ప్రస్తుతం హర్ష సాయి చేతిలో మోసపోయిన  ఆ బాధితురాలు కొన్ని ప్రశ్నలను పోలీసులను అడిగింది. నిన్న కాక మొన్న జరిగినటువంటి జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు ద్వారా జానీ మాస్టర్ ని గోవాలో ఉన్న వెతికి మరి పట్టుకున్నారు. అలాంటిది హర్ష సాయిని పట్టుకోలేకపోతున్నారు ఏంటి ఇది అని  పోలీసులను ప్రశ్నించింది ఆ బాధితురాలు. ఈ ప్రశ్నకు పోలీసులు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఆ బాధితురాలు  ఇంకా ఫైర్ అవుతుంది. నా మీద భారీగా ట్రోల్ జరుగుతున్నాయని వారి మీద కూడా కంప్లీట్ చేసింది. 

 అయితే  హర్ష సాయి మాత్రం ఆ బాధితురాలు వీడియోలు  సోషల్ మీడియాలో ప్రతిరోజు ఒక్కొక్కటి  అప్లోడ్ చేస్తూ  ఇందులో నిజం ఎంత ఉందో ఆలోచించండని ఆ బాధితురాలే నన్ను   బ్లాక్ మెయిల్ చేస్తుందని హర్ష సాయి రోజుకి ఒక వీడియోను విడుదల చేస్తూ ఉన్నాడు. అయినా సరే పోలీసులు మాత్రం హర్ష సాయిని పట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆ బాధితురాలు  పోలీసులు పై విరుచుకుపడుతుంది. 

03 -02

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం హర్ష సాయి  ప్రపంచ యాత్రికుడిగా పేరుపొందిన నా అన్వేషణ  యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దగ్గర దాక్కొని ఉన్నాడని చాలా న్యూస్ మీడియాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ నిన్న మొన్న ఈ రెండు రోజులు పాటుగా  ప్రపంచయాత్రికుడు నా అన్వేషణ దగ్గర దాక్కొని ఉన్నాడని చాలామంది   సోషల్ మీడియా వేదిక ద్వారా తెలుపుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. 

 అయితే హర్ష సాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఎంత ముద్ర వేసుకున్నాడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. హర్ష సాయి ఇప్పటికే ఒక సినిమా కూడా చేశాడు. దానికి భారీగానే ఫ్యాన్స్ స్పందన అనేది  లభించింది. అలాగా కెరీర్లో పేదలకు సహాయం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న హర్ష సాయికి  ఇప్పుడు పెద్ద సవాలు ఏర్పడింది. మరి ఈ బాధితురాలు చెప్పినట్లు  హర్ష సాయి మాత్రం దానికి ఒక్కోవట్లేదు. తనే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని హర్ష సాయి  కొన్ని వీడియోలు కూడా బయట పెట్టాడు. 

అయితే ఆ బాధితురాలు మాత్రం సరే తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు దాక్కుంటున్నావని  ఎదురు మళ్లీ ప్రశ్నలు విసురుతుంది. దీంతో కొంతమంది హర్ష సాయి ఫ్యాన్స్ మాత్రం డబ్బు కోసం తను అలా చేస్తుంది హర్ష సాయి చాలా మంచివాడు. ప్రజలకు కూడా ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు. అని చాలామంది హర్ష సాయి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. కానీ మరి కొంతమంది  సహాయం పేరిట అతను చేసే రాసలీలలు ఇవి అని చాలామంది హర్ష సాయి పై  ఫైర్ అవుతున్నారు.  అలాగే పైన పటారం లోన లొటారం  అని హర్ష సాయిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. 

03 -03
 యూట్యూబ్లో తనకంటూ ఎంతోమంది ఫ్యాన్స్ని సొంతం చేసుకుని ఎన్నో రకాలుగా సహాయం అందించి  వందలలో వేలలో కాకుండా  ఏకంగా లక్షలలో సాయం చేసే హర్ష సాయి ఇలాంటి పని చేశాడు అంటే ఎవరు కూడా నమ్మునటువంటి  అవకాశం ఉంది. అయితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పోలీసులు హర్ష సాయిని పట్టుకుని నిజ నిజాలు ఏంటో తేల్చి కేసును పూర్తి చేయాలని  ప్రజలు కోరుకుంటున్నారు. 

అయితే వీరిద్దరూ ఆరోపించుకుంటున్న మాటలు అనేవి నిజ నిజాలు ఏంటో తేలాలి అంటే కచ్చితంగా పోలీసులు హర్ష సాయిని ఎక్కడున్నా సరే పట్టుకోవాల్సిందే. హర్ష సాయిని పోలీసులుపట్టుకుంటేనే నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?