sand in AP : సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. ఇకపై ప్రజలు దర్జాగా ఇసుకను తీసుకెళ్లండి?
రాష్ట్రంలో ఇసుకను పూర్తిగా ఉచితంగా తీసుకు వెళ్ళవచ్చు అని సీఎం నారా చంద్రబాబునాయుడు ఆర్డర్ చేశాడు. ప్రజలు దగ్గర్లో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఇసుక ఉంటే దర్జాగా ఎడ్ల బండి పోయిన కానీ లేదా ట్రాక్టర్ పైన కానీ తీసుకెళ్లవచ్చని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎవరైనా సరే ఇసుక తరలించుకుంటున్నా వారిపై కేసులు పెడితే వదిలే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.
ఉచిత ఇసుక విషయంలో నా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయినా సరే నేను ఊరుకోనని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది నా ఆర్డర్ మీరు ఉచితంగా ఎక్కడైనా సరే ఇసుకను తీసుకెళ్లవచ్చు అని చెప్పుకొచ్చాడు. నీతో ప్రజలందరూ కూడా చంద్రబాబుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈమధ్య మాజీ సీఎం జగన్ అలాగే ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత ఇసుక పై అలాగే మద్యం పాలసీ పై ఎలా పడితే అలా వాగడంతో చంద్రబాబు నాయుడు ఈ విధంగా స్పందించారు. ఏ చోట ఇసుక ఉన్న సరే దగ్గర ప్రాంతంలోని వారు ఎవరైనా సరే వాళ్లకు నచ్చినట్లుగా ఇసుకను తరలించుకోవచ్చు అని ఎవరైనా అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా నేనే స్వతగా శిక్షిస్తానని చెప్పుకొచ్చాడు.
2024 లో ఘనంగా విజయం సాధించి కూటమి ప్రభుత్వం నుండి టిడిపి నాయకుడైన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాకముందు మద్యం పాలసీపై అలాగే ఉచిత ఇసుక పై చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన విషయం అందరికీ గుర్తుందే. అయితే ఈ విషయంలో అధికారంలోకి రాగానే ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దానికి తగ్గట్టుగా కూటమి నాయకులు ఎవరు పడితే వారు ఎలా పడితే అలా దోచుకున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అలాగే ప్రజలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఈ దృష్టి అటు ఇటు పోయి చివరికి నేరుగా సీఎం దృష్టికి వెళ్ళింది. ఇక నేరుగా రంగంలో దిగిన చంద్రబాబు ఉచిత ఇసుక ప్రతి ఒక్కరికి అందాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రాక్టర్లలో అలాగే ఎడ్లమండలిపై ఎవరైనా ఇసుకను తీసుకువెళ్లినా సరే వాళ్లపై ఎటువంటి కేసులు పెట్టవద్దని అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎవరైనా సరే ఈ ఇసుక తరలించుకునేటువంటి వారిపై కేసులు పెడితూ పెత్తనాలు చాలా ఇస్తే నేనే స్వతాగా రంగంలోకి దిగి మీ పని చూడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక వీటితోపాటుగా ముఖ్యంగా ఆడవాళ్ళపై అత్యాచారానికి అలాగే రాష్ట్రంలో జరిగే ఎటువంటి అల్లర్లకు ముఖ్య కారణం వైసిపి ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రతి ఒక గ్రామంలో కూడా వీధి వీధికి లైట్లు వెలగాలని అధికారులు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేసుకుంటూ వాళ్ళ నిధి నిర్వర్తులు సక్రమంగా పాటించాలని రాష్ట్రంలోని అందరి అధికారులకు గట్టిగా ఏకిపారేశారు.
దీంతో ప్రతి ఒక్కరి అధికారుల గుండెల్లో కూడా భయం పట్టుకుంది. గత ప్రభుత్వంలో అవినీతి తవ్వుకుంటూ పోతుంటే వస్తూనే ఉంది అని వైసీపీ ప్రభుత్వం పై కూడా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మాదిక ద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అలాగే అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలని అధికారులకు హెచ్చరించారు.
ప్రజలకు చెత్త కొన్ని విధించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి చెత్త ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ కూడా నమ్మకూడదని మేము అధికారంలోకి రాగానే ఈ చెత్త పన్ను తీసేశామని గర్వంగా చెప్పుకొచ్చారు. ఇక ఇంతే కాకుండా రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో అల్లకల్లోలం అయ్యాయని ఓటన్నిటిని పోర్చడానికి లేదా కొన్ని కొత్తగా వేయడానికి సుమారు 600 కోట్లు ఖర్చు అవుతుందని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. వీటన్నిటికి కూడా వచ్చే నెల ఒకటో తారీకు నుండి పనులు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.
ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక రాజధాని అమరావతి ఉండాలని గత ప్రభుత్వము లాగా చిల్లర పనులు నేను అసలు చేయనని ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలుకుతానని ఎక్కడా కూడా దేశంలో లేనంత అభివృద్ధిని మన ఆంధ్రప్రదేశ్లో చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఒక్కసారిగా ఫైర్ అయ్యేసరికి చంద్రబాబులో ఈ కోణం కూడా ఉందని ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. విశాఖపట్నం మనకి ఆర్థిక రాజధానిగా అలాగే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇలా ప్రతి ఒక్క మాట కూడా తూటలు లాగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఈ విషయాలన్నీ కూడా బయట మనలాగా చదువుతున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తి కి గురై చంద్రబాబు లో ఇలాంటి ప్రశ్న తత్వం కూడా ఉంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల ఆ ప్రజలందరూ కూడా చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.