Daniel Balaji Died : గుండెపోటుతో ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత.. మూగబోయిన సినీ లోకం
శుక్రవారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే.. డేనియల్ బాలాజీకి ఇప్పటి వరకు వివాహం కాలేదు.
Famous Actor Died : యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బాలాజీ
డేనియల్ బాలాజీ తన సినీ జీవితాన్ని యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రారంభించాడు. అంతకుముందు ఓ సీరియల్ లో నటించాడు. ఆ సీరియల్ లో డేనియల్ అనే పాత్రను పోషించడంతో అదే ఇప్పుడు ఆయన ఇంటి పేరుగా మారింది. ఆ సీరియల్ తెలుగులో పిన్నీ పేరుతో డబ్ అయింది.
ఇండస్ట్రీలో డేనియల్ కు తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్.. డేనియల్ కు బెస్ట్ ఫ్రెండ్. అలాగే.. కొందరు తమిళ హీరోలతో కూడా డేనియల్ క్లోజ్ గా ఉంటాడు. కోలీవుడ్ హీరో విజయ్ మూవీ బిగిల్ లోనూ డేనియల్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు.
తమిళంలో వెట్టయాడు వలయాయడు, వడ చెన్నై, మాయవన్ లాంటి సినిమాలతో డేనియల్ ఫేమస్ అయ్యాడు. మలయాళంలో బ్లాక్ అనే మూవీలో నటించాడు. ఆ తర్వాత భగవాన్, డాడీ కూల్ సినిమాల్లోనూ డేనియల్ నటించాడు.
విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా డేనియల్ ఉంటాడు. విలన్ రోల్స్ కు కరెక్ట్ గా సెట్ అవుతాడని.. గౌతమ్ మీనన్.. వెట్టయ్యాడు విలయ్యాడు సినిమాలో విలన్ పాత్రను ఇచ్చాడు. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో. ఆ సినిమాలో అముధన్ గా నటించాడు డేనియల్. ఆ పాత్రలో విలనిజాన్ని పండించడంలో డేనియల్ సక్సెస్ అయ్యాడు.