Bus Accident : అర్ధరాత్రి విషాదం.. కాలువలో పడిన బస్సు.. 12 మంది మృతి
ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు వర్కర్స్ తో వెళ్తోంది. ఇంతలో అదుపుతప్పిన బస్సు ఓ గని వద్ద మట్టి కోసం తవ్విన కాలువలో పడిపోయింది. అదుపుతప్పిన బస్సు కాలువలో పల్టీలు కొట్టింది. దీంతో 12 మంది మృతి చెందగా.. గాయపడిన వాళ్లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాయిపూర్ లోని ఏఐఐఎమ్ఎస్ కు గాయపడిన వాళ్లను తరలించారు.
బస్సు ప్రమాదం గురించి తెలిసిన ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వర్కర్స్ ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని సూచించారు.
డిస్టిలరీ కంపెనీకి చెందిన ఆ బస్సు.. కంపెనీలో పని పూర్తయిన తర్వాత ఆ కంపెనీకి చెందిన వర్కర్లను తమ ఇళ్లకు తీసుకెళ్తోంది. ఇదే సమయంలో ఖాప్రీ గ్రామం దగ్గరికి రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న 40 అడుగుల లోతులో ఉన్న గోతిలో పడిపోయింది.
బస్సు పల్టీలు కొట్టడంతో బస్సులోనే కొంతమంది మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రుల్లోకి తరలించాక చికిత్స పొందుతూ మృతి చెందారు.
బస్సు ప్రమాదంపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి ట్విట్టర్ లో స్పందించారు. ఈ ప్రమాదంపై తన బాధను వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం గురించి తెలుసుకొని చాలా చింతించాను. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు ఉద్యోగులతో నిండి ఉంది. దుర్గ్ జిల్లాలోని కుమ్హారీ దగ్గర్లో ప్రమాదం జరిగింది.. అని ట్వీట్ చేశారు.
మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ల కుటుంబాలకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. క్షతగాత్రుల కోసం సరైన వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.
గాయపడిన 14 మందిలో 12 మందిని రాయిపూర్ ఏఐఐఎంఎస్ కు తరలించగా.. మిగితా వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవ్వరి ప్రాణాలకు ప్రమాదం లేదని.. అందరూ సేఫ్ అని దుర్గ్ కలెక్టర్ రిచా ప్రకాశ్ చౌదరి తెలిపారు.