Bus Accident : అర్ధరాత్రి ఘోర ప్రమాదం... బ్రిడ్జి నుంచి కిందపడిన బస్సు.. ఐదుగురు మృతి
పూరీ నుంచి వెళ్తున్న బస్సు.. వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తోందని.. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సులో 42 నుంచి 43 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. పూరీ నుంచి బస్సు వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తోంది.. అని జాజ్ పూర్ ఎస్పీ వినిత్ అగర్వాల్ అన్నారు.
ప్రమాదానికి గురైన బస్సు కోల్ కతాకు చెందిన బస్సుగా గుర్తించారు. పూరీ నుంచి బస్సు కోల్ కతా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మీది నుంచి బస్సు వెళ్తుండగా అదుపు తప్పి కింద పడింది. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒడిషా ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
నేషనల్ హైవే 16 పై బారాబతి బ్రిడ్జి మీదికి రాత్రి బస్సు చేరుకుంది. ఇంతలో బస్సు ఆదుపు తప్పి బారాబతి బ్రిడ్జి మీది నుంచి కింద పడటంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. బస్సు డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బస్సు ముందు భాగంలో కూర్చొన్న వాళ్లకే ఎక్కువ గాయాలు అయినట్టు తెలుస్తోంది.
వాళ్లలోనే ఎక్కువ మంది చనిపోయారు. వెనుక భాగంలో కూర్చొన్న వాళ్లు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే.. బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని.. అందుకే అదుపు తప్పి బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మేము అప్పుడు బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇంతలో ఓ బస్సు చాలా వేగంగా రావడం చూశాం. ఆ బస్సు డ్రైవర్.. బస్సును ఇష్టం ఉన్నట్టుగా నడుపుతున్నాడు. అంతలోనే బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడు అని ఓ స్థానికుడు తెలిపాడు.