Electric bike burnt : కామారెడ్డిలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
వెంటనే రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి దూరంగా వెళ్లిపోయాడు. ఇంతలోనే ఒక్కసారి మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఆ మంటలను ఆపేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. బ్యాటరీ సమస్యతో కాలిపోయిందా..? మరే ఇతర కారణం ఉందా అనే విషయం తనకు తెలియదని వాహనదారుడు చెబుతున్నాడు.
పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ వాహనాలు ఖరీదైనప్పటికీ వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వాయు కాలుష్యం కూడా ఉండదు. ఈ వాహనాల వల్ల పలు లాభాలు ఉన్నప్పటికీ వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడో ఓ చోట పేలిపోవడం లేదా కాలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
అయితే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మాత్రం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఎండలో వాహనం ప్రయాణించిన వెంటనే చార్జింగ్ పెట్టవద్దని తెలిపారు. ఇలా చేస్తే బ్యాటరీ హీట్ కారణంగా వాహనం పేలిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఈ నియమాన్ని వాహనదారులు పాటించడంతో అప్పటి నుంచి వాహనాలు పేలిపోవడం, కాలిపోవడం వంటి సంఘటనలు చాలా తగ్గినాయనే చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత మళ్లీ కామారెడ్డిలో ఎలక్ట్రిక్ వాహనం కాలిపోవడం జరిగింది. దీంతో మరోసారి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలంటే మళ్లీ భయపబే పరిస్థితి తలెత్తింది.