Palnadu Bus Accident : ఓటేసి వెళ్తుండగా విషాదం.. ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం

Palnadu Bus Accident : ఓటేసి వెళ్తుండగా విషాదం.. ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం

Palnadu Bus Accident : ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్న వాళ్లు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. బస్సులో చెలరేగిన మంటల్లో కాలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన చిలకలూరిపేట సమీపంలో చోటు చేసుకుంది. 

బాపట్ల జిల్లాలోని చినగంజాం నుంచి ఓ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరింది. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చినగంజాం, దానికి సమీపంలోకి ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఆ బస్సులో ఉన్నారు. వీళ్లంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఓట్లేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. 

అయితే.. ఈవూరివారిపాలెం గ్రామ సమీపంలోకి బస్సు రాగానే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో టిప్పర్ లారీకి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు వెంటనే బస్సుకు కూడా వ్యాపించాయి.  

150 -2

Palnadu Bus Accident : బస్సు డ్రైవర్ తో సహా ఆరుగురు మృతి

బస్సుకు వేగంగా మంటలు వ్యాపించడంతో బస్సు డ్రైవర్ తో పాటు ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. 

అర్ధరాత్రి కావడంతో అందరూ బస్సులో గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో బస్సుకి మంటలు అంటుకోవడంతో అసలు ఏం జరుగుతుందా అని తెలుసుకునే లోపే మంటలు బస్సులోకి వ్యాపించడంతో తప్పించుకునే పరిస్థితి లేక చాలామంది బస్సులోనే చిక్కుకుపోయి మంటలు అంటుకొని మృతి చెందారు. 

వెంటనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పలువురిని బస్సు ప్రమాదం నుంచి కాపాడారు. వెంటనే అంబులెన్స్ లకు, పోలీసులకు ఫోన్ చేయడంలో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.. బస్సులోని మంటలను ఆర్పేసినప్పటికీ బస్సు మొత్తం అప్పటికే మంటల్లో కాలిపోయింది. 

150 -4

అయితే.. అదే ప్రాంతంలో బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. దాని వల్ల రోడ్డుపై మట్టి ఉంది. మరోవైపు టిప్పర్ లారీ వేగంగా రావడం వల్ల బస్సు వచ్చే సమయానికి టిప్పర్ లారీ వేగాన్ని నియంత్రించలేక బస్సును అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 

గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు.. క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో అక్కడి పరిస్థితి దారుణంగా మారింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో కాసేపు ఆ ప్రాంతమంతా నిండటంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. 

ఎంతో ఉత్సాహంతో ఓటేయడం కోసం తమ సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు.. తిరిగి హైదరాబాద్ కు చేరుకోకుండానే విగతజీవులుగా మారిపోయారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌నే  ఉద్దేశంతో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని...
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?