AP SSC Results : ఏపీ పదో తరగతి ఫలితాల రిలీజ్ ఆరోజే.. డేట్ ఫిక్స్ చేసిన విద్యా శాఖ
ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రకటనను డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేసింది. ఈ ఫలితాలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ప్రకటించనున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6.3 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

AP SSC Results : ఫలితాలు ఈ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు
ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఏపీ ఎస్ఎస్సీ రిజల్ట్స్ 2024 అనే లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు మార్కుల లిస్టును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
పది పరీక్షలు పూర్తి కాగానే.. వెంటనే పేపర్ల కరెక్షన్ ప్రక్రియను ఎస్ఎస్సీ బోర్డ్ ప్రారంభించింది. ఏప్రిల్ 8 వరకు మూల్యాంకనం పూర్తి చేశారు అధికారులు. ఆ తర్వాత ఫలితాలను ఆన్ లైన్ లో పొందుపరిచారు. నిజానికి ఫలితాలు మేలో విడుదల కావాల్సి ఉంది.
కానీ.. మే నెలలో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మేలో కాకుండా త్వరగా మూల్యాంకనం చేపట్టి ఏప్రిల్ లోనే విడుదల చేస్తున్నారు. కంప్యూటరీకరణను కూడా పూర్తి చేశారు. ఫలితాల విడుదల కోసం ఎన్నికల కమిషన్ ను విద్యా శాఖ అధికారులు సంప్రదించగా.. ఫలితాల విడుదలకు ఈసీ కూడా ఆమోదం తెలపడంతో ఈనెల 22న విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.