TS ECET Answer Key 2024 : రేపే తెలంగాణ TS-ECET 2024 ప్రిలిమినరీ "కీ" విడుదల...ఇదిగో లింక్...
ఈ నేపథ్యంలోనే పరీక్షలకు హాజరైన విద్యార్థులు మే 11 నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ ఆన్సర్ కీ తో పాటు వారి రెస్పాన్స్ షీట్ మరియు మాస్టర్ ప్రశ్న పత్రాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు. ఇక ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు మే 13వ తేదీ ఉదయం 11 గంటల లోపు తెలియజేయాల్సిందిగా సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కోర్సులో రెండో సంవత్సరం ప్రవేశాలకు డిప్లమా మరియు బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే టి.ఎస్ ఈసెట్ 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రవేశ పరీక్షల కోసం ఫిబ్రవరి 15 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా , చివరగా ఏప్రిల్ 28వ తేదీ వరకు ఆలస్య రుసుమును కట్టించుకుని దరఖాస్తులను స్వీకరించారు.
ఆ తర్వాత ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులలో ఏమైనా తప్పులు ఉన్నవారు సరిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులకు మే 1వ తేదీ నుండి సంబంధిత అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లను విడుదల చేశారు.
అనంతరం మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు టీఎస్ ఈసెట్ పరీక్షలను నిర్వహించారు. అయితే ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 95 కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. దీనిలో తెలంగాణ జిల్లాలో 48 హైదరాబాద్ రీజియన్ లో 44 ఆంధ్రప్రదేశ్లో 7 పరీక్ష కేంద్రాలు నిర్వహించారు.