బడ్జెట్ లో ఉద్యోగుల‌కు ఊర‌ట ద‌క్కానా?..

బడ్జెట్ లో ఉద్యోగుల‌కు ఊర‌ట ద‌క్కానా?..

బడ్జెట్‌ అంటే పన్నులతో పీక్కు తినడం అన్న భావన రూఢీ అయ్యింది. ఎక్కడి నుంచి ఏ రూపంలో ఎంత వసూలు చేయవచ్చో అన్న లెక్కలు కట్టి..దానికి కొంత జోడిరచి...కొన్ని పనులను కొంత కేటాయింపులు చేసి చూపడమే బడ్జెట్‌. ఈ లెక్కల ప్రకారం వచ్చే ఆదాయానికి, చెల్లించే ఖర్చులకు లెక్కల పొంతన కుదరాలి. నిజానికి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని దేశాన్ని నడపడానికి ఉపయోగించాలి. జీతాలు, ఆస్పత్రులు, విద్యా, రైలు, రోడ్డు తదితర అభివృద్ది పనులకు వినియోగించాలి.

అంతేగానీ ఉచితపథకాలతో దుబారా చేయరాదు. పన్నులు కూడా హేతుబద్దంగా ఉండాలి. ప్రజల నడ్డి విరిచేలా పన్నులు ఉంటే...వారు పన్నులు కట్టలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే ప్రజలు సంపాదించు కున్న డబ్బుల్లో నేరుగా 30 శాతం ప్రభుత్వం లాగేసుకుంటుంది. ఉద్యోగుల నుంచి కూడా టిడిఎస్‌ ద్వారా నేరుగా లాగేసుకుంటుంది. అంటే మనం ఎంత సంపాదించినా ముందుగా 30శాతం బొక్క పెట్టుకోవాల్సిందే. అలాగే మనం పెట్టుకునే ఖర్చులకు లెక్కలు చెప్పుకోవాలి. ఇలా ఏటా మన సంపాదన నుంచి కాబూలీవాల వడ్డీలాగా చెల్లించుకోవాల్సిందే. తేడా వస్తే ప్రభుత్వం వారు దాడి చేసి, కేసులు పెట్టి వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read Also Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్... అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ప‌థ‌కాలు ఇలా..!

ఇలా మన ఆర్థిక చట్టం నిర్దేశించుకున్నాం. అందుకే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అనగానే ఉద్యోగులు,  వ్యాపారులు భయపడుతుంటారు. నిజానికి ఇలాంటి భయాలు లేని ఆదాయపు చట్టం రావాలి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో వాటిని ఎలాగే కంట్రోల్‌ చేయడం లేదు. కనీసం పన్నుల భారం అయినా తగ్గుతుందా అంటే అదీ ఉండడం లేదు. కట్టిన డబ్బులతో అధికారంలో ఉన్న నేతలు వారి జల్సాలకు ఎక్కువగా వినయోగిస్తున్నారు. మంత్రులు, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలకు కూడా మనం చెల్లించే పన్నుల నుంచే  జీతభత్యాలు చెల్లించాలి. ఉద్యోగులకు కూడా జీతాలు, పెన్షన్లు కూడా ఇందులో నుంచే ఇవ్వాలి.

Read Also Hyperloop train: విమానం కన్నా స్పీడ్ గా దూసుకు వెళ్లే  ట్రైన్!... మన భారతదేశంలోనే?

ఇవి గాకుండా దేశంలో ఏ పని చేపట్టాలన్నా ఇందులో నుంచే ఖర్చు చేయాలి. ఇవన్నీ సమతూకం పాటించేలా, లెక్కలు బేరీజు వేసుకుని బడ్జెట్‌ రూపొందిస్తారు. ఈ క్రమంలో  దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.ఫిబ్రవరి 1న అంటే శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వరసగా 8వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటాలాగానే పేద, మధ్యతరగతి ప్రజలు తమకు చేకూరే లబ్ది గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read Also Fake Currency Notes: ఎక్కడ చూసినా  నకిలీ నోట్లు?... వీటిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి?

3103

అయితే చాలా మందికి బడ్జెట్‌ లెక్కలు పెద్దగా అర్థం కావు. బడ్జెట్‌లో దేనికి పెంచారు..దేనికి తగ్గించారు అని చూస్తుంటారు. సిగరెట్లు, మద్యం వంటి వాటికి ఏటా పన్నుపోటు తప్పదు. ఎలక్టాన్రిక్స్‌ తదితర దిగుమతి వస్తువలపైనా సుంకాలు పెంచుతూనే ఉంటారు. ఇలా పత్రికల్లో వచ్చిన, లేదా టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రజలు బడ్జెట్‌ గురించి బేరీజు వేసుకుంటారు. తమ జేబులకు ఎంత చిల్లు పడబోతున్నదో లేక్కలేసుకుంటారు. స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్‌ ఇదే. కొన్ని ప్రధాన అంశాలపై దృష్టి పెట్టగలిగితే బ్జడెట్‌ గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. వాటిలోని గణాంకాలను అర్థం చేసుకోగలిగితే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందు కు దేనిపై దృష్టి పెట్టాలో అర్థమవుతుంది.

రుణాలు కాకుండా ప్రభుత్వ మొత్తం ఖర్చులు దాని ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఆర్థికలోటు ఏర్పడుతుంది. అప్పులు తెచ్చి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 2024 నుంచి మార్చి 2025 వరకూ ఉంటుంది. ఇందులో రాబడి ఎంత..ఖర్చులు ఎంత అన్నది లెక్కలు వేస్తారు.బడ్జెట్లో ఆర్థికలోటును జీడీపీలో 4.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక 
లోటుపై కేంద్రం ఏం చెప్తుందోనని మార్కెట్‌ వర్గాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి.

అంవటే ఈ లోటు ఎలా పూర్తి చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న. అందుకు పన్నులు వేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటును తీర్చుకునేందుకు పలు రకాలుగా రుణాలు సేకరిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం స్థూల రుణ బడ్జెట్‌ రూ. 14.01 లక్షల కోట్లుగా ఉంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్థూల రుణ బ్జడెట్‌ గురించి మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం పన్నుల ద్వారా ప్రభుత్వ నిర్వహణకు అవసరమయ్యే ఆదాయం సమకూర్చుకుంటుంది. 2024-25 బ్జడెట్‌లో స్థూల పన్ను ఆదాయాన్ని రూ.38.40 లక్షల కోట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

దీంట్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.22.07 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.16.33 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.11.1 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2024 మొదట్లో ఖర్చులు బాగా నెమ్మదించాయి. దీనికి ఎన్నికల కోడ్‌ కారణమనే చెప్పొచ్చు. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో మూలధన వ్యయం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది కేంద్రం వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కింద ఎంత ఖర్చు చేయనుందో బడ్జెట్‌ సమావేశాల్లో తెలియనుంది. 2024లో సాధారణ ప్రభుత్వ రుణం- జీడీపీ నిష్పత్తి 85 శాతం ఉండగా.. అందులో ఒక్క కేంద్ర ప్రభుత్వ రుణమే 57 శాతంగా ఉంది. నిర్మలా సీతారామన్‌ 2024-25 బడ్జెట్‌ ప్రసంగంలో 2026-27 నుంచి జీడీపీలో ద్రవ్యలోటు తగ్గించేందుకు నిరంతరం ప్రయత్ని స్తామని చెప్పిన విషయం తెలిసిందే.

స్తు, సేవల పన్ను అంటే జీఎస్టీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. కావున 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ రాబడి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10.5 శాతంగా కేంద్రం అంచనా వేసింది. కాకపోతే వాస్తవ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని ఆర్థిక పండితులు చెబుతున్నారు. అయితే జిఎస్టీ పన్నులు తలకు మించిన భారంగా ఉన్నాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ లాంటి వాటిపైనా 18శాతం జిఎస్టీ విధించడం వల్ల సామాన్యులు గగ్గోలు పెట్టినా కేంద్రం పట్టించుకోలేదు. మొత్తంగా పన్నుల హేతుబ్దీకరణతో పాటు, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసినప్పుడే ప్రజలకు ఊరట కలుగుతుంది. అలాగే ధరల స్థిరీకరణకు చర్యలు కూడా అవసరం. ఈ రకమైన చర్యలు లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఉండదు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు? Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Travel:  మన భారతదేశంలో పర్యాటకులకు పర్యటించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. చాలామంది పర్యాటకులు కొన్ని వేల రూపాయలు లేదా లక్ష రూపాయలు ఖర్చు చేసైనా కొన్ని మంచి...
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?
Alcohol: మద్యం తాగడం  ఆరోగ్యానికి హానికరమా?.. ఉపయోగకరమా? 
Poverty: మీరు చేసే పనుల వల్లే పేదరికంలో ఉంటున్నారు!...  ఇలాంటివి అసలు చేయకండి?
Red Sandalwood: ఎర్రచందనం చెట్టుకు ఎందుకు అంత డిమాండ్!... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Belly Fat: మీకు ఎంత పెద్ద పొట్ట ఉన్నా క్షణాల్లో కరిగిపోవాల్సిందే! ఎలానో  తెలుసా?