బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత!..

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత!..

శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవపేట్ గ్రామానికి చెందిన ఐదు బాధిత కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.ఐదు  వేల చొప్పున మొత్తం రూ. ఇరవై అయిదు వేల ఆర్థిక సహాయం అందించినట్టు వారు తెలిపారు. దుర్ఘటనలో కాలు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిన దుగ్గూరు సత్యనారాయణను, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన రఘుజి ప్రశాంత్ కుటుంబాన్ని, మరణించిన మాజీ సఫాయి కార్మికుడు మేకల పోచయ్య కుటుంబాన్ని, చెట్టుపై నుంచి పడిపోయి కాలు విరిగిన ఇమ్రాన్‌ను, గుండెపోటుతో మృతిచెందిన నరాల సహదేవ్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పిన నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు అక్బర్, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, మహమ్మద్ ఖాన్, వారాల గణేష్ , కళ్యాణ్, జహంగీర్, ప్రేమ్ కుమార్, షాదుల్, షబ్బీర్, మహమ్మద్, దుర్గేష్, అజ్జు, నవీన్ చారి, ప్రశాంత్, లోకేష్, నితిన్, కొమ్ము బాబు, శ్రీను, రాజేష్, అఖిల్, నవాజ్, కరీం, కాజా పాషా, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250417-WA0023

Read Also బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు!..

Tags:

Join Us @ Social Media

Latest News

రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!.. రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఏప్రిల్ 24 వరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని...
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?
Haunted House: మీ ఇంటి పరిసరాలలో దెయ్యం ఉందో లేదో ఈ సాంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు?